హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mumbai Fire Accident: ముంబైలో మరో అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలంలో 8 ఫైరింజన్లు

Mumbai Fire Accident: ముంబైలో మరో అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలంలో 8 ఫైరింజన్లు

ముంబై ప్రభాదేవి ప్రాంతంలో అగ్ని ప్రమాదం(Image-ANI)

ముంబై ప్రభాదేవి ప్రాంతంలో అగ్ని ప్రమాదం(Image-ANI)

ముంబైలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రభాదేవి ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో ఉదయం 6 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

  ముంబైలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల ముంబైలోని భాండూప్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 11 మంది కరోనా పెషేంట్లు మృతిచెందిన తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే తాజాగా ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో(Prabhadevi Area) మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభాదేవి ప్రాంతంలోని వీర్ సావర్కర్ రోడ్డులోని ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. Gammon Houseలోని బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగినట్టుగా స్థానికులు తెలిపారు. అనంతరం మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఎనిమిది ఫైరింజన్లు, ఏడు పెద్ద వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

  ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిసింది. అయితే అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఈ బిల్డింగ్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నందున అందులో ఉన్న ఎలక్ట్రికల్ కేబుల్స్, మండే స్వభావం ఉన్న ఇతర వస్తువులు.. అగ్ని ప్రమాద తీవ్రతను పెంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

  కుర్లా మురికివాడలో అగ్ని ప్రమాదం..

  ఇక, కుర్లా ప్రాంతంలో కూడా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సర్వోదయ మార్గ్ మురికివాడలో ఈ ప్రమాదం జరిగింది. బాబా హాస్పిటిల్‌ సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు వారు శ్రమిస్తున్నారు.


  కోవిడ్ ఆస్పత్రిలో ప్రమాదం.. 11కు చేరిన మృతుల సంఖ్య

  ముంబైలోని ఓ ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 76 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మంటల ధాటికి ఆస్పత్రిలోకి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడున్న వారంతా ప్రాణ భయంతో హాహా కారాలు చేశారు. ఘటన స్థలంలోనే ఇద్దరు మృతిచెందగా.. మరో తొమ్మిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 23 ఫైరిజంన్లతో మంటలు అదుపు చేశారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Fire Accident, Maharashtra, Mumbai

  ఉత్తమ కథలు