Home /News /crime /

FIRE BREAKS OUT AT HOSPITAL ICU AT IN DELHIS ROHINI AREA PATIENT FEARED DEAD PAH

Fire breaks: భారీ అగ్ని ప్రమాదం.. ఆస్పత్రిలో చెలరేగిన మంటలు..

ఆస్పత్రిలో ఎగిసి పడుతున్న మంటలు

ఆస్పత్రిలో ఎగిసి పడుతున్న మంటలు

Delhi: ఆస్పత్రి మూడో అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో కూడా మంటలు వ్యాపించాయి.

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi)  భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోహిణి ప్రాంతంలోని (Rohini area) పూత్ ఖుర్ద్‌ లో ఉన్న.. బ్రహ్మశక్తి ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో రోగులు,వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బయటకు పరుగులు తీశారు. అయితే, ఒక రోగి ఐసీయూలో గదిలో ఉన్నాడు. అతను చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంతో దట్టమైన పొగలు వ్యాపించాయి.

స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి (Fire Accident) సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తొమ్మిది ఫైర్ ఇంజిన్ లను ఆ ప్రాంతంలో తరలించారు. కాగా, వెంటిలేటర్ సపోర్టులో ఉన్న ఒక రోగి తప్ప మిగిలిన వారందరూ సురక్షితంగా రక్షించబడ్డారని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.



ఇదిలాా ఉండగా గతంలోను ఢిల్లీలో అగ్ని ప్రమాదం సంభవించింది.

ఢిల్లీలోని ముంద్కా మెట్రో స్టేషన్‌ (Mundka Metro station)సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ముంద్కా మెట్రో స్టేషన్ 544వ నంబరు స్తంభం వద్ద ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో పెద్ద ఎత్తున మంటలు (Delhi Fure Accident) ఎగిసిపడ్డాయి. సాయంత్రం 04.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 24 ఫైరింజన్లను రంగంలోకి దించారు. ఓ వైపు మంటలు అదుపు చేస్తూనే.. మరోవైపు భవనంలోని కార్యాలయాలలో చిక్కుకున్న పలువురిని కాపాడారు. దాదాపు 70 మందిని కాపాడి భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు. మరికొందరు మాత్రం మంటల్లో కాలిపోయి మరణించారు. వారి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. ఐతే ఇంకా కొంద మంది ఆచూకీ మాత్రం దొరకలేదు.

ప్రమాదానికి గురైన భవనంలోని కార్యాలయాల్లో పనిచేసే వారి కుటుంబ సభ్యులు, బంధువులు.. ఘటనా స్థలానికి వెళ్లి, తమ వారి గురించి అధికారుల గురించి ఆరా తీస్తున్నారు. 29 మంది ఆచూకీ దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. మరి వారంతా కిందకు దూకేశారా? లేదంటే కాలి బూడిదయ్యారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ బిల్డింగ్ నుంచి దూకి ప్రాణాలతో బయటపడితే.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పేవారని.. కానీ ఇప్పటి వరకు వారి గురించి ఎలాంటి సమాచారం లేదు. అంటే ఈ లెక్కన వారు మరణించినట్లుగానే అర్థం చేసుకోవాలని కొందరు అధికారులు పేర్కొన్నారు. మూడంతస్తుల ఆ భవనంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టరాని విధంగా ఉన్నాయని.. డీఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాతే, వాటిపై క్లారిటీ వస్తుందని చెప్పారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Fire Accident

తదుపరి వార్తలు