హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fire Accident: ఇళ్ల మధ్య ఉన్న గోడౌన్‌లో ఎగసిపడిన మంటలు.. ఉలిక్కిపడిన జనం.. 8 ఫైర్ ఇంజన్లు స్పాట్‌కు..

Fire Accident: ఇళ్ల మధ్య ఉన్న గోడౌన్‌లో ఎగసిపడిన మంటలు.. ఉలిక్కిపడిన జనం.. 8 ఫైర్ ఇంజన్లు స్పాట్‌కు..

  ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్‌లో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు రేగాయి. దీంతో.. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 8 ఫైర్ ఇంజన్లతో స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గోడౌన్ రూఫ్ నుంచి మంటలు ఎగసిపడుతుండటం, నల్లగా పొగలు కమ్ముకోవడంతో ఆ ప్రాంతంలో కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది.

  మురికవాడల మధ్యలో ఉన్న ఈ గోడౌన్‌లో మంటలు రేగడంతో ఆ ప్రాంతంలో నివసించే వారంతా ఉలిక్కిపడ్డారు. ముంబైలో మెరకగా ఉండే ప్రాంతాల్లో ఘట్కోపర్‌లోని అసల్ఫా ప్రాంతం ఒకటి. ఈ హిల్ ప్రాంతంలో చాలా మురికివాడలు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో గోడౌన్‌లో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా అనే విషయం తెలియాల్సి ఉంది.


  ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనావాసాలకు సమీపంలో ఉన్న ఈ గోడౌన్‌లో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల.. ముంబైలో వరుసగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

  ఇది కూడా చదవండి: Chennai: బ్యాంకులో ఉద్యోగం.. నెలకు 2 లక్షలకు పైగానే జీతం.. కానీ ఏం లాభం.. డిసెంబర్ 31న..

  డిసెంబర్ 28న కూడా ముంబైలోని కండీవాలీ ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో మంటలు రేగాయి. ఆ బిల్డింగ్ టెర్రాస్‌పై దాదాపు 45 మంది చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది 40 మందిని సురక్షితంగా కాపాడారు. మిగిలిన ఐదుగురు అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్‌కు తరలించారు.

  ఇది కూడా చదవండి: Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్న మరుసటి రోజే లారీ డ్రైవర్‌కు ఊహించని అనుభవం..

  ఆ బిల్డింగ్‌లోని మీటర్ బాక్స్‌లో మంటలు చెలరేగి బిల్డింగ్ అంతా మంటలు, పొగ కమ్ముకున్నట్లు ఆ ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. ఐదుగురు ఈ పొగ కారణంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడటంతో వారిలో ముగ్గురిని బీడీబీఏ మున్సిపల్ జనరల్ హాస్పిటల్‌కు, ఇద్దరిని భాస్కర్ హాస్పిటల్‌కు తరలించారు. ఐదుగురు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు.

  First published:

  Tags: Fire Accident, Mumbai, National News

  ఉత్తమ కథలు