అపార్ట్‌మెంటులో మంటలు... 20 ఫ్లాట్లు పూర్తిగా దగ్ధం

సమాచారం అందుకున్న వెంటనే 100 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు

news18-telugu
Updated: June 10, 2019, 8:32 AM IST
అపార్ట్‌మెంటులో మంటలు... 20 ఫ్లాట్లు పూర్తిగా దగ్ధం
లండన్‌లో అగ్నిప్రమాదం
  • Share this:
లండన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డీపాస్ గార్డెన్స్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంటులో చెలరేగిన మంటలు ఆరు అంతస్తుల వరకు వ్యాపించాయి. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌లోని 20 ఫ్లాట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మరో పది ఫ్లాట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే 100 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 అగ్నిమాపక శకటాలతో రెండు గంటలపాటు కష్టపడి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ముందుగా ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని రక్షించారు. ఆ చుట్టుపక్కల ఉన్నవారిని రక్షించి దూరంగా తరలించారు. ఆ మార్గాన్ని మూసివేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.


First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>