హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fire Accident : 59 మంది చనిపోయిన ఆ థియేటర్ లో మళ్లీ అగ్నిప్రమాదం

Fire Accident : 59 మంది చనిపోయిన ఆ థియేటర్ లో మళ్లీ అగ్నిప్రమాదం

ఉపహార్ థియేటర్ లో అగ్నిప్రమాదం

ఉపహార్ థియేటర్ లో అగ్నిప్రమాదం

Uphaar Cinema Hall : సినిమా ప్రదర్శన సమయంలోనే అగ్నిప్రమాదం  జరిగింది. ఊపిరాడక అభిమానులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటనో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాటలో మరో 100 మందికిపైగా గాయపడ్డారు.

Fire At  Uphaar Cinema : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ఉపకార్‌ సినిమా (Uphaar Grand)హాల్ లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీ గ్రీన్​ పార్క్​ మెట్రోస్టేషన్​ సమీపంలోని ఉపహార్​ సినిమా థియేటర్ ​లో ఆదివారం ఉదయం 4.45 గంటల తర్వాత మంటలు చెలరేగాయి. క్షణాల్లో హాల్​ మొత్తం విస్తరించాయి. దీంతో హాల్ లోని బాల్కని, కింది ఫ్లోర్‌లో ఉన్న సీట్లు,ఫర్నీచర్​ కాలిబూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 9 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన 3 గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ హాని జరగలేదని చెప్పారు.

కాగా, రెండంతస్థుల ఉపకార్‌ థియేటర్ 20 ఏళ్ల క్రితమే మూతపడింది. 1997 జూన్​ 13న ఇదే థియేటర్ ​లో.. సినిమా ప్రదర్శన సమయంలోనే అగ్నిప్రమాదం  జరిగింది. ఊపిరాడక అభిమానులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటనో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాటలో మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఆ సమయంలో థియేటర్‌లో బార్డర్‌ అనే హిందీ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత ఈ థియేటర్ ని ఇప్పటివరకు తెరవలేదు.

First published:

Tags: Cinema, Delhi, FIRE

ఉత్తమ కథలు