Home /News /crime /

FIRE AFTER EXPLOSION AT SAUDI OIL DEPOT NEAR JEDDAH F1 RACE VENUE PVN

Video : సౌదీ ఆయిల్ డిపోపై హౌతీ రెబల్స్ దాడి..F1 ట్రాక్ సమీపంలో ఎగసిపడ్డ మంటలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Explosion At Saudi Oil Depot:సౌదీ అరేబియాపై తాము వరుస దాడులు చేశామని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు హౌతి రెబల్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయిల్ దిగ్గజం ఆరామ్‌ కో సంస్థ ఎర్ర సముద్ర నగరం జెడ్డాలో అనేక ఫెసిలిటీస్ ను కలిగి ఉంది.

ఇంకా చదవండి ...
Houthi rebels attacked an oil depot : సౌదీ అరేబియాలోని జెడ్డా న‌గ‌రంలోని ఆయిల్ డిపోలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఎఫ్‌1 రేస్ ప్రారంభం కానుండ‌గా..ఆ ప్రదేశానికి సమీపంలోని ఆయిల్ డిపోపై శుక్ర‌వారం యమెన్ కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. సౌదీ అరేబియాపై తాము వరుస దాడులు చేశామని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు హౌతి రెబల్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.."జెడ్డాలోని ఆరాంకో సంస్థలకు చెందిన ఆయిల్ డిపోలు మరియు రియాద్‌ లో కీలకమైన సంస్థాపనలపై మేము డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులతో అనేక దాడులు చేసాము" అని ఇరాన్-మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు.

ఆయిల్ దిగ్గజం ఆరామ్‌ కో సంస్థ ఎర్ర సముద్ర నగరం జెడ్డాలో అనేక ఫెసిలిటీస్ ను కలిగి ఉంది. కొన్ని రోజుల క్రితం జెడ్డాలోని ఆయిల్ డిపోలో ఇలాంటి దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇప్పుుడు ఈ దాడి జరిగింది. అగ్ని ప్రమాదం అదే నార్త్ జెడ్డా బల్క్ ప్లాంట్‌ లో కేంద్రీకృతమై ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. నార్త్ జెడ్డా బల్క్ ప్లాంట్.. సౌదీలో రెండవ అతిపెద్ద నగరమైన జెడ్డాలో ఉపయోగం కోసం డీజిల్, గ్యాసోలిన్ మరియు జెట్ ఇంధనాన్ని నిల్వ చేస్తుంది. ఇది సౌదీ అరేబియా యొక్క మొత్తం సరఫరాలలో నాలుగింట ఒక వంతుకు పైగా ఉంది.



కాగా,ఫార్ములా వన్ రేస్ జరుగబోయే ట్రాక్ కి సమీపంలో మంట‌లు, భారీ పొగ‌తో కూడిన దృశ్యాల వీడియోలు ఇంట‌ర్నెట్‌లో చక్క‌ర్లు కొడుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై సౌదీ అరేబియా ప్రభుత్వ ఆయిల్ కంపెనీ మరియు ప్రభుత్వ మీడియా మొదట వెంటనే ధృవీకరించలేదు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఫార్ములా వన్‌ రేస్‌ ఆదివారం జరుగనున్నది. కార్యక్రమానికి అవాంతరాలు సృష్టించడంలో భాగంగానే తిరుగుబాటుదారులు ఈ భయపెట్టే చర్యలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: FIRE, Saudi Arabia

తదుపరి వార్తలు