Fire Accident Tragedy: ఇంట్లోని కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి అనుకోని ప్రమాదం జరిగింది. ఏమైందో కానీ ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించాయి. ఆ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అరుపులు, కేకలు వినిపించాయి. కానీ తెరుకునే లోపే ఘోరం జరిగిపోయింది.
కేరళలోని (Kerala)వర్కలాలో దారుణం చోటుచేసుకుంది. కూరగాయలు అమ్మి వ్యాపారం చేసుకునే ప్రతాపన్ కుటుంబం అగ్నికి ఆహుతైంది. అర్దరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు(Fire Accident) చెలరేగాయి. దీంతో నిద్రలో ఉన్న వారు నిద్రలోనే అగ్నికి ఆహుతయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటనతో వర్కలాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి చెలరేగిన మంటల కారణంగా, ఆ కుటుంబంలో ఐదుగురు సజీవదహనమయ్యారు.
పూర్తి వివరాలు... ప్రతాపన్ అనే వ్యక్తి కేరళలోని (Kerala) వర్కలాలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కూరగాయలు (Vegitable Business) అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతి రోజు మాదిరిగా రాత్రి అందరు పడుకున్నారు. అప్పుడు అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు (Fire Accident Tragedy)వ్యాపించాయి. ఇంట్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పోగలు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. బాధితుల అరుపులతో ఇరుగుపోరుగు వారు లేచారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది (Fire engine) మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అప్పటికే ఆ కుటుంబంలోని ఐదుగురు (Family Death) అగ్నికి ఆహుతయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో.. ప్రతాపన్ (62), షెర్లీ (53), అభిరామి (25), అఖిల్ (29), అభిరామి ఎనిమిది నెలల కుమారుడు రియాన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే, ప్రతాపన్ పెద్ద కుమారుడు నిహల్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతడిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఆ ఇంట్లో పెద్ద ఎత్తున సామానతా అగ్నికి (Fire) కాలిబూడిదయ్యింది.
చుట్టు పక్కల వారు.. అక్కడికి చేరుకుని ఆ కుటుంబ స్థితిని చూసి కన్నీటిపర్యంత మవుతున్నారు. సంఘటన స్థలానికి పలువురు అధికారులు చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ (Short Circuit)కారణామా... మరేదైన కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ (Police Investigation) చేపట్టారు. ప్రస్తుతం వారి కుటుంబంలో శోక సముద్రంలో మునిగిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Fire Accident, Kerala