హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... ఓ చిన్నారి మృతి

ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... ఓ చిన్నారి మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fire Accident in Hospital : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కి ఎదురుగానే ఈ ఆస్పత్రి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆస్పత్రికి వచ్చి మొత్తం చెక్ చేస్తున్నారు.

  Fire Accident in Hospital : ఎల్బీనగర్‌లోని షైన్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ICU విభాగంలో రకరకాల కరెంటు వైర్లు ఎక్కువై... తేడా వచ్చి... ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో... పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. పొగకు ఊపిరి ఆడక ఓ చిన్నారి చనిపోయింది. మరో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ICUలోని చిన్నారులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది... ఆస్పత్రి ICU అద్దాలు పగలగొట్టి... మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కి ఎదురుగానే ఈ ఆస్పత్రి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆస్పత్రికి వచ్చి మొత్తం చెక్ చేస్తున్నారు. ఆస్పత్రిని మూసివేసిన పోలీసులు... ICUలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు... అలర్ట్ అలారం ఎందుకు మోగలేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే... ICUలో అన్నన్ని వైర్లు, కేబుల్స్ ఎందుకు ఉన్నాయని అడుగుతున్నారు.

  ICU విభాగం పూర్తిగా కాలిపోయింది. ప్రస్తుతం ఆస్పత్రిని క్లోజ్ చేశారు. అందులోని రోగుల్ని ఇతర ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన తమ చిన్నారిని తమకు అప్పగించాలని ఆ పాప తల్లిదండ్రులు ఏడుస్తూ కోరుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి దగ్గర ఆందోళనకర, విషాద వాతావరణం ఉంది.


  హాట్‌ అందాల శ్రీముఖి... అదిరిపోయిన లేటెస్ట్ ఫొటో షూట్


  ఇవి కూడా చదవండి :

  Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు


  Health Tips : కోడిగుడ్డు, పొట్లకాయ... కలిపి తింటున్నారా... జాగ్రత్త

  Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

  Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు