Fire breaks out at building in Agripada: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్రిపాడ లోని నివాస సముదాయంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున జరిగినట్లు సమాచారం. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ అధికారులు నాలుగు ఫైరింజన్ లతో ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు.
మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి ప్రదేశం అంతా.. దుమ్ము, ధూళి, పొగతో నిండిపోయింది. తెల్ల వారు జామున ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అవి పక్క బిల్డింగ్ కు కూడా వ్యాపించాయి. దీంతో అపార్ట్ మెంట్ లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు. చుట్టు పక్కల వారంతా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు.
Mumbai | Fire breaks out on the second floor of a building in Agripada area. 4 fire engines at the spot
Details awaited. pic.twitter.com/SUQRcVAVtU
— ANI (@ANI) April 19, 2022
ఒక్కసారిగా మంటలు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా వ్యాపించాయి. ముందు జాగ్రత్తగా అధికారులు ఆయా ప్రాంతాలలో అంబులెన్స్ లను మోహరించారు. ఇప్పటి వరకు ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని పేర్కొన్నారు.
గతంలో కూడా ముంబైలోని కర్రీ రోడ్డు ప్రాంతంతో కూడా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం (Mumbai Fire Accident) జరిగింది. కర్రీ రోడ్డు ప్రాంతంలో ఉన్న 60 అంతస్తుల అవిఘ్నా పార్క్ టవర్ (Avighna Park Tower)లో మంటలు చెలరేగాయి. 19వ అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను చూసి ఆ భవనంలో నివసిస్తున్న వారు భయంతో వణికిపోయారు. కొందు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. ఐతే ఓ వ్యక్తి 19వ అంతస్తు బాల్కని నుంచి కింద పడి మరణించారు. మృతుడిని 30 ఏళ్ల అరుణ్ తివారిగా గుర్తించారు పోలీసులు. అతడు కింద పడిన వెంటనే హుటాహుటిన KEM ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఉదయం 11.50 నిమిషాల సమయంలో భవనం నుంచి మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. 26 మందికి మంటల నుంచి కాపాడారు. ఇక ముందు జాగ్రత్తగా 19 అంతస్తులో ఉండే మిగతా వారిని కిందకు తరలించారు. ఈ ప్రమాదాన్ని లెవెల్-4 గుర్తించారు అధికారులు. అంటే చాలా తీవ్రమైన అగ్నిప్రమాదమని చెప్పారు. అగ్నిప్రమాదానికి గురైన అవిఘ్నా పార్క్ టవర్లో మొత్తం 61 అంతస్తులు ఉన్నాయి. ఐతే ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Maharashtra, Mumbai