news18-telugu
Updated: April 19, 2019, 10:49 AM IST
రైల్ నిలయం(ఫైల్ ఫోటో)
సికింద్రాబాద్ రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడో అంతస్తులోని టెలికమ్యునికేషన్ డిపార్ట్మెంట్లో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు మంటలు చెలరేగాయి. పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు...అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో కొన్ని కంప్యూటర్లు, ఫర్నిచర్లు, రికార్డులు కాలిబూడిదయ్యాయి. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టాన్ని అధికారులు ఇంకా అంచనావేయలేకపోతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.
First published:
April 19, 2019, 10:49 AM IST