హోమ్ /వార్తలు /క్రైమ్ /

నెల్లూరు కెమికల్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం... వాసన వస్తోందంటూ జనం పరుగులు..

నెల్లూరు కెమికల్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం... వాసన వస్తోందంటూ జనం పరుగులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు జోడిగాడితోటలో ఉన్న బాలాజీ కెమికల్ గోడౌన్‌లో మంటలు అంటుకున్నాయి. కెమికల్ వాసర రావడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి పరుగులు పెట్టారు.

నెల్లూరులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కెమికల్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. నెల్లూరు జోడిగాడితోటలో ఉన్న బాలాజీ కెమికల్ గోడౌన్‌లో మంటలు అంటుకున్నాయి. కెమికల్ వాసర రావడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి పరుగులు పెట్టారు. యాసిడ్, బ్లీచింగ్ పౌడర్ లాంటివి ఇక్కడ తయారు చేస్తారని తెలుస్తోంది. మంటలు వచ్చిన వెంటనే చుట్టుపక్కల వారు ఫైరింజన్లకు సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. టీవీల్లో ప్రసారమైన వీడియోలను పరిశీలిస్తే.. ఆ గోడౌన్‌లో భారీ ఎత్తున డ్రమ్ములు కనిపిస్తున్నాయి. అందులో కెమికల్ ఉందా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ బాలాజీ కెమికల్స్‌ చుట్టుపక్కల జనావాసాలు ఉన్నాయి. అగ్నిప్రమాదంతో దట్టమైన పొగ రావడంతో ఆ చుట్టుపక్కల ఉన్నవారు తమ కళ్లు మండుతున్నాయని ఫిర్యాదు చేశారు. అయితే, అది పొగవల్లనా? లేకపోతే కెమికల్స్ వల్లనా? అనేది వైద్యులు ధ్రువీకరించనున్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి అనిల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎల్జీ పాలిమర్స్ తరహా గ్యాస్ ఇక్కడ ఉండదని కొందరు చెబుతున్నారు. అయితే, కంపెనీ లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Fire Accident, Nellore

ఉత్తమ కథలు