హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fire Accident in Hyderabad: హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ జరగడంతో..

Fire Accident in Hyderabad: హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ జరగడంతో..

Tragedy : అమ్మమ్మ, రెండు కుక్క పిల్లలను కలిపి సజీవ దహనం..చేసిన మనవడు..

Tragedy : అమ్మమ్మ, రెండు కుక్క పిల్లలను కలిపి సజీవ దహనం..చేసిన మనవడు..

హైదరాబాద్(Hyderabad) లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం తలెత్తింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Exhibition Ground)కు చెందిన అజంతా గేటు పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో కిటికీలో నుంచి పొగలు బయటకు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు, వెంటనే ఫైర్ సిబ్బందికి, బేగం బజార్ పోలీసుల(Police)కు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది కేవలం ఐదు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిటికీలు, షటర్లను పగలగొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో బ్యాంక్ లోని కంప్యూటర్లు, ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి. స్ట్రాంగ్ రూమ్ కు ఎలాంటి మంటలు వ్యాపించలేదని బ్యాంకు అధికారులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ ప్రమాదం బ్యాంకు సమయం ముగిసిన అనంతరం చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Fire Accident, Hyderabad, Sbi, State bank of india

    ఉత్తమ కథలు