బస్సులో మంటలు.. ఐదుగురు సజీవ దహనం

ఏం జరిగిందో తెలిసేలోపే బస్సులోని ఐదురుగు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ ఉన్నారు.

news18-telugu
Updated: August 12, 2020, 8:18 AM IST
బస్సులో మంటలు.. ఐదుగురు సజీవ దహనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో తెలిసేలోపే బస్సులోని ఐదురుగు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ ఉన్నారు. ప్రైవేటు బస్సులు బెంగళూరు నుంచి విజయపురకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. పలువురు అగ్ని ప్రమాదం నుంచి బయటపడగా... ఐదురుగు మాత్రం మంటల నుంచి బయటకు రాలేక మృతి చెందారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా నిద్ర మత్తులో ఉన్నారు. ఇక ఈ ఘోర ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Published by: Kishore Akkaladevi
First published: August 12, 2020, 8:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading