ఫుట్ బాల్ క్లబ్‌లో మంటలు.. పది మంది సజీవదహనం

బ్రెజిల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 10 మంది యువ ఫుట్ బాల్ ప్లేయర్స్ ఆ మంటల్లో సజీవదహనమయ్యారు.

news18-telugu
Updated: February 8, 2019, 11:06 PM IST
ఫుట్ బాల్ క్లబ్‌లో మంటలు.. పది మంది సజీవదహనం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 8, 2019, 11:06 PM IST
బ్రెజిల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియో డి జెనీరోలోని ఓ ఫుట్ బాల్ క్లబ్‌లో మంటలు వ్యాపించాయి. సుమారు 10 మంది యువ ఫుట్ బాల్ ప్లేయర్స్ ఆ మంటల్లో సజీవదహనమయ్యారు. బ్రెజిల్లో ఫ్లెమింగో అనేది ప్రఖ్యాత ఫుట్ బాల్ క్లబ్. ఎంతో మంది యువ ఫుట్ బాల్ ప్లేయర్స్ అక్కడ తమ కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తుంటారు. క్లబ్‌లో ఉండే డార్మిటరీలో క్రీడాకారులు నిద్రిస్తున్న సమయంలో మంటలు అంటుకున్నాయి. దీంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

బ్రెజిల్‌లోని ఫ్లెమింగ్ క్లబ్ ఏరియల్ వ్యూ (Image:CNN)
బ్రెజిల్‌లోని ఫ్లెమింగ్ క్లబ్ ఏరియల్ వ్యూ (Image:CNN)


ఫ్లెమింగో ఫుట్ బాల్ క్లబ్‌కి, మరో జట్టుకి మధ్య ఫిబ్రవరి 9న మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అంతలోనే అగ్నిప్రమాదం జరిగిందని తెలిసి వారంతా షాక్ తిన్నారు. ఫుట్ బాల్ క్లబ్‌లో ప్రమాదం విషయంపై రియో గవర్నర్ విల్సన్ మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.

First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...