రూ.73 కోట్ల విలువైన నీళ్లను దోచుకున్నారంటూ ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఆరుగురు నిందితులపై కేసులు నమోదుచేశారు. పాండ్యా మ్యాన్షన్ అనే అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్న సురేష్ కుమార్ ఢోకా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. భవనం ఓనర్లు అనధికారికంగా రెండు బావులను తవ్వి.. అందులో నీటిని గత 11 ఏళ్లుగా అమ్ముకుంటున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలా 11 ఏళ్లుగా భూగర్భ జలాలను అమ్ముకోగా, వాటి విలువ సుమారు రూ.73 కోట్లు ఉంటుందని తెలిపాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించాడు. సురేష్ కుమార్ ఢోకా ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ... ‘వారికి బావి తవ్వుకోవడానికి ఎలాంటి అనుమతి లేదు. అయినా వారు బావి తవ్వారు. అందులో పైప్ లైన్లు కూడా వేసి నీటిని తోడుకున్నారు.’ అని తెలిపారు. ఆ బావి తవ్విన ప్రదేశం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకున్నారు. అక్కడ ఒక్క ఇటుకను కదపాలంటే కూడా కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలి. కానీ, ఎలాంటి అనుమతి తీసుకోకుండా నీళ్లు తవ్వారని ఆరోపించాడు.
పులి పిల్లలను పట్టుకుని ఎలా వేధిస్తున్నారో చూడండి
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.