chittoor : కూలి చేసుకునే వారే టార్గెట్... కోట్ల రూపాయలతో ఉడాయించిన చిట్టిల వ్యాపారి

ప్రతీకాత్మక చిత్రం

chittoor : రోజువారి కూలీ చేస్తూ.. అరకొర సంపాదనతో కడుపు మార్చుకుని మరి దాచుకున్న సొమ్ము. కరోనా కష్టకాలంలో తమను ఆదుకుంటుందని నమ్మి చీటీలు కట్టారు. అయితే.. నమ్మిన చీటీల వ్యాపారి ఉన్నపళంగా ఉడాయించారు. కోట్ల రూపాయలు మాయ చేసి పారిపోయాడు.

  • Share this:
    అవసరానికి డబ్బులు సమకూర్చేందుకు చీటీలు వేస్తారు కూలీలు. అయితే తమను నమ్మి చీటీలు వేసిన వారిని నట్టేట ముంచేస్తున్నారు కొంతమంది చిట్టి వ్యాపారులు...ఈ క్రమంలోనే ఓ చీటీల వ్యాపారి .. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలను నమ్మించాడు. నమ్మిన వారిని నట్టెట్లో ముంచిన ఘటన చిత్తూరు జిల్లా..నగిరిలో వెలుగు చూసింది.

    ఏకాంబరం కుప్పం గ్రామానికి చేందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి చీటీల వ్యాపారం చేస్తూ చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలను నమ్మించాడు.. ఏళ్ళ తరబడి అక్కడే నివాసం ఉండటంతో ... గ్రామంలో ఉన్న ప్రజల వద్ద నమ్మకం తెచ్చుకున్నాడు. నమ్మకం రావడంతో గ్రామా ప్రజలతో పాటు...తమ బంధువుల వద్ద నుండి లక్ష రూపాయల నుండి పది లక్షల వరకూ చీటీల వ్యాపారం కొనసాగించేవాడు. స్ధానికంగా ఉన్న మధ్య తరగతి చేనేత కార్మికులతో నమ్మకం కల్పించి...చిన్న స్ధాయి నుండి పెద్ద స్ధాయి వరకూ అందరి దగ్గర చీటీలు వేయించాడు. ఇలా కొద్ది రోజులు గడిపి చిన్న చిన్న చీటీలు వేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వడంతో ఎస్బీ అరుణ్ కుమార్ పై స్ధానికులకు మరింత నమ్మకం ఏర్పడింది.

    దీంతో అతని వద్ద పెద్ద మొత్తంలో చీటీలు వేసేందుకు స్ధానికులు ముందుకు వచ్చారు. వారి వద్ద నుండి నెల నెల డబ్బులు కట్టించుకునే వాడు. చీటీలు వేస్తున్న స్ధానికులు అరుణ్ కుమార్ కి చెల్లించాల్సిన  సొమ్ము చెల్లింపు పూర్తి అయింది..చీటీ పూర్తి అయినా తమ డబ్బు తమకు చెల్లించక పోవడంతో.. స్ధానికులు వ్యాపారిని చీటీల డబ్బులు చెల్లించాలని నిలదీసారు.తమ డబ్బు తమకు చెల్లిస్తానని కొంత కాలం పాటు గడువు కావాలని కోరిన అరుణ్ కుమార్.. వారికి ఇచ్చిన గడువు పూర్తి అవుతున్నా.. చీటీ నగదు చెల్లింపు చేయకుండా కొంతకాలం పాటు వారిని సతాయించాడు.ఇలా అరుణ్‌కుమార్ వలలో 400 మందికి పైగా బాధితులు చీటీలు కట్టించుకొని సొమ్ము చెల్లించకుండా కాలం వెల్లదీశాడు.. చీటీ డబ్బులు అడిగిన వారికి ఏదొక సమాధానం చెప్తూ వాయిదా వేసేవాడు.

    ఇలా కాలం వెళ్లదీస్తూనే చివరికి మొండిచేయి చూపించాడు..పక్కా ప్లాన్ ప్రకారం ఇంటినుండి ఎవరికి చెప్పకుండా పారిపోయాడు. దీంతో విషయం అర్ధమైన బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో సుమారు 80 మంది బాధితుతు కేసులు నమోదు చేశారు. కాగా అరుణ్‌ కుమార్ భారి నష్టపోయిన బాధితులు సుమారు 400 మంది వరకు ఉంటారని అంచనా. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:yveerash yveerash
    First published: