FINANCIAL CRISIS LEADS TO CONSTABLE SUICIDE IN HYDERABAD SSR
Constable: భార్యాపిల్లలను అత్తారింట్లో వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చాడు.. ఇంతలోనే ఎంతపని చేశాడంటే...
కానిస్టేబుల్ అభిలాష్ నాయక్(ఫైల్ ఫొటో)
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం బాలాజీ నగర్ గ్రామానికి చెందిన అభిలాష్ నాయక్(33) ఆరేళ్లుగా మాదన్నపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. ముసారాంబాగ్‌లోని బాలమ్మదానమ్మ బస్తీలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. 2011లో ఇందిరా జ్యోతి అనే యువతిని అభిలాష్ వివాహం చేసుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
హైదరాబాద్: రానురాను మారుతున్న కాలంతో పాటు మనిషికి మానసిక ఒత్తిళ్లూ పెరిగాయి. కొందరికి ఫ్యామిలీ టెన్షన్స్, మరికొందరికి ఆఫీస్ టెన్షన్స్, ఇంకొందరికి బిజినెస్ టెన్షన్స్.. ఇలా కారణం ఏదైనప్పటికీ మనిషిపై మానసిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నికొన్ని సందర్భాల్లో మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలూ రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ తరహా ఘటనే వెలుగుచూసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోలీస్ కానిస్టేబుల్ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం బాలాజీ నగర్ గ్రామానికి చెందిన అభిలాష్ నాయక్(33) ఆరేళ్లుగా మాదన్నపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. ముసారాంబాగ్‌లోని బాలమ్మదానమ్మ బస్తీలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. 2011లో ఇందిరా జ్యోతి అనే యువతిని అభిలాష్ వివాహం చేసుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో అభిలాష్ సతమతమవుతున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా చోటుచేసుకున్నాయి. రెండు రోజుల క్రితం భార్యాపిల్నల్ని కోదాడలోని అత్తగారింట్లో వదిలిపెట్టి వచ్చాడు. సోమవారం డ్యూటీ చేసి ఇంటికి వెళ్లాడు.
సోమవారం అర్ధరాత్రి అభిలాష్ ఉంటున్న ఇంట్లో నుంచి కేకలు రావడంతో ఇరుగుపొరుగు గది తలుపులను పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో అభిలాష్ కనిపించాడు. గొంతు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే అభిలాష్ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నగరంలో మరో కానిస్టేబుల్ కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రమణమూర్తి(38), శారదా భార్యాభర్తలు.
హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమణమూర్తి సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సాయిబాబానగర్ పాండు బస్తీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలోనే.. 20 రోజుల క్రితం రమణ మూర్తి మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. దీంతో.. ఆమె అలిగి అదే కాలనీలో ఉంటున్న సోదరుని ఇంటికి వెళ్లి అప్పటి నుంచి ఇంటికి రాలేదు. ఈ పరిణామంతో తీవ్ర మనస్థాపం చెందిన రమణ మూర్తి మే 1న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.