Hyderabad: ఆమెకు 25 ఏళ్లు.. అతడికి 22 ఏళ్లు.. 40 ఏళ్ల భర్తకు ఫ్లాట్ లో అడ్డంగా దొరికిపోయారు.. చివరకు ఏం జరిగిందంటే..!

రుబీనా, అలీ (ఫైల్ ఫొటోలు)

ఆమెకు 25 ఏళ్ల వయసు. ఆ కుర్రాడికి 22 ఏళ్ల వయసు. ఇద్దరి మధ్య మూడేళ్ల తేడా. అతడే వయసులో చిన్న. అయినా వివాహేతర సంబంధం వారిని ఒక్కటి చేసింది. 40 ఏళ్ల భర్త వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా ఫ్లాట్ లో పట్టుకుంటే..

 • Share this:
  ఓ వ్యక్తి 15 ఏళ్లు చిన్నదయిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆలోచనల్లోనూ, మనస్థత్వాల్లోనూ ఇద్దరిలో ఎప్పుడూ తేడానే. భర్త అభిరుచులతో భార్యకు, భార్య ఇష్టాఇష్టాలతో భర్తకు ఎప్పుడూ సయోధ్య కుదిరేది కాదు. వయసు అంతరమే దీనికి ప్రధాన కారణమని వేరుగా చెప్పనవసరం లేదు. ఆమెకు పాతికేళ్ల వయసు వచ్చేనాటికి భర్తకు 40 ఏళ్ల వయసు. లైంగిక పరంగానూ భర్తతో ఆమె సుఖాన్ని పొందలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో తనకంటే మూడేళ్లు చిన్నోడయిన ఓ కుర్రాడు ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరికీ మధ్య వివాహేతర సంబంధం కుదిరింది. నేరుగా ఆ కుర్రాడు ఆమె ఇంటికే వెళ్లి రావడం మొదలు పెట్టాడు. ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా ఫ్లాట్ లోనే భర్తకు దొరికిపోయారు. కొన్నాళ్లకు ఘోరానికి పాల్పడ్డారు. జూబ్లిహిల్స్ లో కార్మికనగర్లో ఫ్రిజ్ లో శవం ఘటనలో బయటపడిన నిజాలివి. వివరాల్లోకి వెళ్తే..

  హైదరాబాద్లోని జూబ్లిహిల్స్ పరిధిలోని కార్మికనగర్లో టైలర్ గా పనిచేసే మహ్మద్ సిద్ధిఖ్ అహ్మద్ కు 40 ఏళ్ల వయసు. అతడి భార్య రుబీనాకు సరిగ్గా 25 ఏళ్ల వయసు. వయసు రీత్యా భార్యాభర్తలిద్దరికీ 15 ఏళ్ల తేడా. ఇతర అన్ని విషయాలతో పాటు లైంగిక పరంగానూ రుబీనా భర్త పట్ల అసంతృప్తితో ఉండేది. ఈ క్రమంలోనే సయ్యద్ మహ్మద్ అలీ అనే 22 ఏళ్ల కుర్రాడు రుబీనాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. మొదట్లో లాడ్జిల్లోనూ, పార్కుల్లోనూ కలిసే వారిద్దరూ, ఆ తర్వాత నేరుగా ఇంట్లోనే రాచకార్యాలు మొదలు పెట్టారు. భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడు ఇంట్లోకి దూరేవాడు.

  కొన్నాళ్ల క్రితం ఫ్లాట్ లో వీళ్లిద్దరూ సిద్దిఖ్ కు అడ్డంగా దొరికిపోయారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరినీ చితకబాదాడు కూడా. తమ బంధానికి అడ్డంగా ఉన్న సిద్ధిఖ్ ను హతమార్చాలని రుబీనా, అలీ నిర్ణయించుకున్నారు. మార్చి 28వ తారీఖున పిల్లలతో కలిసి రుబీనా తన పుట్టింటికి వెళ్లింది. తన సోదరుడి ఇంట్లో కార్యక్రమానికి ముందుగానే వెళ్తున్నట్టు చెప్పింది. మార్చి 30న సిద్ధిఖ్ కూడా బావమరిది ఇంట జరిగిన కార్యక్రమానికి హాజరయి రాత్రిపూట ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని రుబీనా తన ప్రియుడు అలీకి చెప్పింది. అలీ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి సిద్ధిఖ్ ను హతమార్చాడు. శవాన్ని మాయం చేయాలని చూసినా కుదరలేదు. దీంతో ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసి తల భాగాన్ని ఫ్రిజ్ లో పెట్టి తలుపులు మూసి వచ్చేశాడు. చంపిన తర్వాత రుబీనాకు వీడియో కాల్ చేసి మరీ సిద్దిఖ్ శవాన్ని చూపించాడు.

  ఇంట్లో శవం గురించి పోలీసులకు ఇంటి యజమాని సమాచారం ఇవ్వడం, ఆ సమయంలో భార్య కూడా ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అనుమానించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అలీని అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఫోన్లు చేసిన రుబీనాను కూడా పట్టుకున్నారు. రెండేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందనీ, తమ బంధానికి అడ్డుగా ఉండటం వల్లే చంపేశామని ఒప్పుకున్నారు. మంగళవారం నిందితులిద్దరినీ మీడియా ముందు ప్రవేశ పెట్టి కేసునకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
  Published by:Hasaan Kandula
  First published: