సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఓ డైరెక్టర్ నీచపు చర్యకు పాల్పడ్డాడు. పదేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన పోలీసులు ఓ కేసుకు సంబంధించి బాలికను విచారిస్తున్న సమయంలో వెలుగుచూసింది. నిందితుడిని అట్టింగ్ కిజువిలామ్ ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల శ్రీకాంత్ ఎస్ నాయర్‌గా గుర్తించారు. వివరాలు.. 16 ఏళ్ల కుర్రాడు తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని 13 ఏళ్ల బాలిక తల్లి అట్టింగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అతడు తాను బాలికతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు చెప్పాడు. దీంతో పోలీసులు ఇందుకు సంబంధించి బాలికను కూడా విచారించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మహిళా పోలీసులు చాలా సేపు బాలికతో మాట్లాడారు. దీంతో యువకుడు తనను వేధిస్తున్నట్టు బాలిక చెప్పింది.
అదే సమయంలో పోలీసులు లోతుగా బాలికతో మాట్లాడుతుండగా.. గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. డైరెక్టర్ శ్రీకాంత్ తనను మూడేళ్ల క్రితం వేధింపులకు గురిచేసినట్టుగా ఆరోపించింది. ‘శ్రీకాంత్ అనే వ్యక్తి నా తల్లికి కజిన్. మూడేళ్ల క్రితం అతను తరచు మా ఇంటికి వచ్చి వెళ్లేవాడు. నేను ఇంట్లో ఒకదాన్నే ఉన్నప్పుడు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి వేధింపులకు పాల్పడ్డాడు. అయితే భయపడి ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు’అని బాలిక తెలిపింది.
కనిపించకుండా పోయిన పోస్టాఫీస్ ఉద్యోగిని.. నాలుగు రోజుల తర్వాత కుటుంబానికి తెలిసిన షాకింగ్ న్యూస్..
ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఎస్ నాయర్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వివరంగా ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేశారు. అనంతరం అతడిని అట్టింగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, శ్రీకాంత్ వండర్ బాయ్, రాంగ్ టర్న్ చిత్రాలను తెరకెక్కించాడు. మరోవైపు యువతిని వేధించిన 16 ఏళ్ యువకుడిని పోలీసులు జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Kerala