Film director: సినీ దర్శకుడిపై మహిళ ఫిర్యాదు.. హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ షూటింగ్ ఉందని చెప్పి..

ప్రతీకాత్మక చిత్రం

ఓ సినీ దర్శకుడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 39 ఏళ్ల మహిళ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ షూటింగ్ ఉందని చెప్పి..

  • Share this:
    ఓ సినీ దర్శకుడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 39 ఏళ్ల మహిళ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ షూటింగ్ ఉందని చెప్పి.. తన కారును తీసుకెళ్లాడని చెప్పింది. అయితే ఆ తర్వాత తన కారును వేరే వ్యక్తికి అమ్మేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ దర్శకుడు కారు ఇవ్వకపోవడంతో తాను ఆరా తీయగా.. అసలు విషయం బయటికొచ్చిందని తెలిపింది. ఈ ఘటన గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బోడక్‌దేవ్ ప్రాంతానికి చెందిన నీతాబెన్ షా అనే మహిళ.. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు సినీ దర్శకుడు యష్ వైధ్ అనే దర్శకుడితో నాలుగేళ్లుగా పరిచయం ఉంది. 2018లో నీతాబెన్.. హ్యుందాయ్ క్రెటా కారును కొనుగోలు చేశారు.

    ఈ ఏడాది జూన్‌లో యష్ వైధ్.. హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ షూటింగ్ ఉందని నీతాబెన్‌తో చెప్పాడు. అందుకు ఆమె కారు 20 రోజుల పాటు కావాలని ఆడిగాడు. అయితే యష్ వైధ్ తెలిసిన వ్యక్తే కావడంతో ఆమె కూడా తన హ్యుందాయ్ క్రెటా కారును అతనికి 20 రోజులు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే నీతాబెన్‌ నుంచి కారు తీసుకున్న యష్ వైధ్.. 20 రోజులు గడిచిన తర్వాత కూడా ఆమె కారును తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆమె తన కారును ఇవ్వమని యష్ వైధ్‌ను డిమాండ్ చేసింది. అయితే యష్ మాత్రం మరో 10 రోజులు కారుతో అవసరం ఉందని చేశాడు. ఆ తర్వాత యష్ వైధే తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. నీతాబెన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.

    Gang rape In Train: మరో నిర్భయ.. కదులుతున్న రైలులో యువతిపై సామూహిక అత్యాచారం

    అయితే నీతాబెన్‌ కారును అమ్మేసినట్టుగా యష్ వైధ్ డ్రైవర్ ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు నీతాబెన్‌కు ఆమె కారుకు సంబంధించిన విషయాన్ని యష్ వైధ్ తెలిపాడు. తనకు డబ్బు అవసరం ఉన్నందును కారును తాకట్టు పెట్టినట్టుగా చెప్పాడు. అయితే నీతాబెన్.. తన కారును యష్ వైధ్.. భావ్‌నగర్‌లోని ఓ వ్యక్తికి రూ. 8 లక్షలకు అమ్మేశాడని తెలుసుకుంది. అతని వివరాలను సేకరించింది.

    Teacher - Student: ఫీలింగ్స్ చెప్పాలని బాలుడికి మెసేజ్.. కారులోనే పలుమార్లు లైంగిక దాడి.. బాలుడి సోదరికి..

    అయితే యష్ వైధ్ ఆ కారును తన భార్య కారు అని చెప్పి తనకు అమ్మినట్టుగా కొనుగోలు చేసిన వ్యక్తి నీతాబెన్‌కు తెలిపాడు. అది యష్ వైధ్ భార్య కారు కాదని, అది తన కారని అతడికి నీతాబెన్ వివరించింది. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రం కారును తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే నీతాబెన్ వస్త్రపూర్ పోలీస్ స్టేషన్‌లో యష్ వైధ్‌పై ఫిర్యాదు చేసింది. ఇక, గతంలో కూడా యష్ వైధ్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయని.. ఇది ఐదోది అని సమాచారం.
    Published by:Sumanth Kanukula
    First published: