ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తున్నారు. మహిళలను ఆకతాయిల నుంచి.. కామాంధుల నుంచి కాపాడాల్సిన పోలీసులే... ఆ పనులకు ఒడిగడుతున్నారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన వ్యక్తులే వాటికి విఘాతం కలిగిస్తే..
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తున్నారు. మహిళలను ఆకతాయిల నుంచి.. కామాంధుల నుంచి కాపాడాల్సిన పోలీసులే... ఆ పనులకు ఒడిగడుతున్నారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన వ్యక్తులే వాటికి విఘాతం కలిగిస్తే.. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాళ్లే వారిపై కర్కశంగా వ్యవహరిస్తే.. అదే జరిగింది మహారాష్ట్ర లో....! ఆ రాష్ట్రంలోని జల్గావ్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ హాస్టళ్లలోని అభ్యాగులైన బాలికలను నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ కొందరు కామాంధులు ఒత్తిడి చేశారు. వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే స్థానికంగా ఉండే మరికొందరితో కలిసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టడం దారుణం. జల్గావ్ జిల్లాలోని ఆశాదీప్ ఉమెన్స్ హాస్టల్లో ఈ ఘోరం జరిగింది. ఛిఖ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వేత మహాలే అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తడంతో వెలుగులోకి వచ్చింది .అయితే, జల్గావ్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అభాగ్యులైన బాలికలను బట్టలిప్పమని ఒత్తిడి చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే శ్వేత మహాలే మండిపడ్డారు. ఆ హాస్టల్లో ఇంకా చాలా మంది మహిళలపై ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని, ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని విపక్ష బీజేపీ బుధవారం అసెంబ్లీలో నిలదీసింది. పోలీసులు ఇలాంటి దారుణానికి పాల్పడటం సిగ్గుచేటని విమర్శించింది. ప్రభుత్వం ఏం చర్య తీసుకున్నదని ప్రశ్నించింది.
ఇక, ప్రతిపక్షాల ప్రశ్నలకు హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. ఈ ఘటనను ప్రభుత్వం ఖండిస్తున్నదని తెలిపారు. దర్యాప్తు కోసం నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ఆభాగ్యులైనవారు, ఆనాథలు అయిన బాలికలు, మహిళలకు ఈ హాస్టల్లో వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.