Home /News /crime /

FEMALE TIKTOK STAR HUSBAND COMMITS SUICIDE IN HYDERABAD SU

Hyderabad: TikTok స్టార్ భర్త ఆత్మహత్య.. అసలు కారణం అదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ టిక్‌టాక్ స్టార్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

    ఓ టిక్‌టాక్ స్టార్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రియాంక నిమ్‌కర్ అనే మహిళ టిక్‌టాక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు పవన్ నిమ్‌కర్ అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. ప్రస్తుతం భర్త పవన్ నిమ్‌కర్‌తో కలిసి ఫతేనగర్‌లో నివాసం ఉంటుంది. పవన్ ఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక, టిక్‌టాక్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. అయితే భార్య ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా గడపడం పవన్‌కు నచ్చలేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ప్రియాంకను పవన్ హెచ్చరించాడు. అయితే ప్రియాంక మాత్రం భర్త మాటలు పట్టించుకోలేదు.

    ప్రియాంక రోజులో చాలా సేపు మొబైల్ పట్టుకునే గడిపేది. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. అయితే తనపై అనుమానంతోనే పవన్ ఇలా చేస్తున్నాడని ప్రియాంక భావించింది. దీంతో పవన్‌ను ఉద్దేశిచి సూటిపోటి మాటలు మాట్లాడేది. దీంతో ఇద్దరి మధ్య నాలుగైదు రోజుల నుంచి తీవ్ర గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే పవన్, ప్రియాంకలు.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు.

    అయితే ఈ క్రమంలోనే పవన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియాంక మాటలు, వేధింపుల వల్లే పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు వారు బాలనగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పవన్ ఆత్మహత్య చేసుకోవడానికి భార్యభర్తల మధ్య గొడవలే కారణమా..? లేక వేరే ఇతర కారణాలున్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Hyderabad, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు