ఆ పరిచయమే బలి తీసుకుందా..? జడ్చర్లలో టెన్త్ విద్యార్థిని హత్య..

Student Murder : రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన విద్యార్థిని గురువారం ఉదయం జడ్చర్ల మండలంలోని శంకరాయపల్లి దగ్గర ఆమె శవమై కనిపించింది.

news18-telugu
Updated: August 29, 2019, 12:01 PM IST
ఆ పరిచయమే బలి తీసుకుందా..? జడ్చర్లలో టెన్త్ విద్యార్థిని హత్య..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 29, 2019, 12:01 PM IST
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది.పట్టణానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని దారుణ హత్యకు గురైంది.ఫేస్‌బుక్‌‌లో పరిచయమైన నవీన్ రెడ్డి అనే యువకుడే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫేస్‌బుక్ పరిచయంతో ఆమె ఫోన్ నంబర్ తీసుకున్న నవీన్.. రెండుసార్లు ఆమెను కలిశాడు. ఇద్దరూ తరుచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఇదే క్రమంలో 2 రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం జడ్చర్ల మండలంలోని శంకరాయపల్లి దగ్గర ఆమె మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...