• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • FEMALE IPS OFFICER BOOKED FOR KICKING PREGNANT WOMAN WHO SUFFERS MISCARRIAGE SB

గర్భిణిని బూటు కాలితో తన్నిన ఎస్పీ... మహిళకు అబార్షన్

గర్భిణిని బూటు కాలితో తన్నిన ఎస్పీ... మహిళకు అబార్షన్

ప్రతీకాత్మక చిత్రం

భర్త ఆచూకీ చెప్పాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. అక్కడితో ఆగక గర్భిణి అయిన ఆమె పొట్టపై బూటుకాలితో బలంగా తన్నారు.

  • Share this:
    ఓ కేసులో నిందితుడైన వ్యక్తి ఆచూకీ చెప్పాలంటూ ఓ మహిళా ఎస్పీ రెచ్చిపోయింది. నిందితుడిగా భావిస్తున్న భార్యను స్టేషన్‌కు రప్పించింది. ఆమె గర్భిణి అయినప్పటికీ సాటి మహిళ అని కూడా చూడకుండా పొట్టపై బూటుకాలితో తన్నింది ఓ మహిళ ఎస్పీ. ఈ ఘటనలో అబార్షన్ అవ్వడంతో బాధితురాలు బాధతో విలవిలలాడింది.  ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. గత నెల మూడో తేదీన సుందర్‌గఢ్ జిల్లాలోని కణిక గ్రామంలో కారు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు కారణమైన నిందితులను అరెస్ట్ చేయాలంటూ గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ వద్ద ఆందోళనకు చేసి విధ్వాంసానికి దిగారు. దీనిపై స్పందించిన మహిళా ఎస్పీ సౌమ్య మిశ్రా స్వయంగా కేసు పర్యవేక్షణ చేపట్టారు.

    నిందితుల్లో ఒకరైన ప్రియాడే భర్త ఉత్తమ్ డే కూడా ఉన్నాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ఎస్పీ.. భర్త ఆచూకీ చెప్పాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. అక్కడితో ఆగక గర్భిణి అయిన ఆమె పొట్టపై బూటుకాలితో బలంగా తన్నారు. దీంతో ఆమెకు గర్భ విచ్ఛిత్తి జరిగింది.దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. తనను బలంగా కొట్టి అబార్షన్‌కు కారణమైన మహిళా ఎస్పీ సౌమ్య మిశ్రాను కఠినంగా శిక్షించాలంటూ కేసు పెట్టింది. ఈ కేసు విచారించిన న్యాయస్థానం... సౌమ్య మిశ్రాపై క్రిమినిల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    అగ్ర కథనాలు