Home /News /crime /

FEMALE DOG HER PUPPY STRANGLED AND HANGED TO DEATH ON TREE IN MAHARASTRA VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SK

కుక్కతో పాటు దాని పిల్లనూ ఉరేసి చంపేశారు.. అసలు మనుషులేనా? మూగజీవాలపై ఇంత క్రూరత్వామా?

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Dogs Hanged to death: కుక్కల హత్యల వెనక ఆ మహిళా నేత హస్తం ఉండొచ్చని జంతు ప్రేమికులు అనుమానిస్తున్నారు. ఈ కుక్క తమ కుటుంబంలోని ఒక్క వ్యక్తిని కరిచిందని.. ఆ కోపంతోనే ఉరివేసి చంపి ఉంటారని చెప్పారు.

    మనదేశంలో మూగజీవాలపై దాడులు పెరుగుతున్నాయి. ఆవులు, కుక్కలు, పిల్లులు, ఏనుగులపై విచక్షిణారహితంగా దాడులు చేసి.. చంపేసిన ఘటనలు గతంలో కొన్ని చోట్ల జరిగాయి. నోరు లేని జీవులను చిత్రహింసలకు గురిచేసి కొందరు దుండగులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. నొప్పితో అవి అల్లాడిపోతుంటే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన ఉదంతాలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో దారుణంజరిగింది. ఉల్హాస్‌నగర్‌లో గుర్తుతెలియని రెండు కుక్కలను దారుణంగా హింసించి.. చెట్టుకు ఉరివేసి.. చంపేశారు.

    ఉల్హాస్‌నగర్‌లోని సాయినాథ్ కాలనీలో మార్చి 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు కుక్కలను చెట్టుకు ఉరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీని గురించి స్థానికులకు తెలిసింది. బహిరంగ ప్రదేశంలో ఒక చెట్టుకు ఒక ఆడ కుక్క, దాని పిల్ల వేలాడుతూ వీడియోలో కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులను వాటిని తీవ్రగా హింసించి.. అనంతరం చెట్టుకు ఉరేశారు. ఉరివేయడంతో ఆ రెండు కుక్కలు మరణించాయి. ఉదయాన్నే ఈ రెండు కుక్కల మృతదేహాలు రోడ్డుపక్కన ఉన్న చెత్తకుప్పలో పడి ఉన్నాయి.  అనంతంర వాటిని మున్సిపల్ సిబ్బంది డంప్ యార్డుకు తీసుకెళ్లి విసిరేశారు. జంతు హక్కుల సంఘాలకు చెందిన కొందరు జంతు ప్రేమికులు అక్కడికి వెళ్లారు. కుక్కలను చంపిన తీరును చూసి చలించిపోయారు. అనంతరం హిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు.

    పెళ్లైన 20 రోజులకు షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన వధువు.. వరుడి మైండ్ బ్లాంక్..

    ఆ రోజు ఉదయం మున్సిపల్ సిబ్బంది రెండు కుక్కలను డంప్ యార్డ్‌కు తరలిస్తుండగా తాను చూశానని..సృష్టి చుగ్ అనే టీచర్ తెలిపారు. ఈ కుక్కలను హింసించి చంపేశారని.. పోలీస్ కేసు అవుతుందని.. స్పాట్ నుంచి తొలగించకూడదని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. కానీ వాటిని అక్కడి నుంచి తొలగించాలని స్థానిక మహిళా నేత ఒకరు తమను ఆదేశించారని.. అందుకే తొలగిస్తున్నామని ఆ మున్సిపల్ చెప్పినట్లు సృష్టి చుగ్ తెలిపారు. కుక్కల హత్యల వెనక ఆ మహిళా నేత హస్తం ఉండొచ్చని ఆమె అనుమానించారు. ఈ కుక్క తమ కుటుంబంలోని ఒక్క వ్యక్తిని కరిచిందని.. ఆ కోపంతోనే ఉరివేసి చంపి ఉంటారని చెప్పారు.

    Extramarital Affair : మరిదితో వదిన ఎఫైర్.. ఇది తెలిసిన అన్న ఏం చేశాడంటే

    ఆ రెండు కుక్కలను ఎవరు చంపారు? ఎందుకు చంపారన్న వివరాలు మాత్రం ఇప్పటి వరకైతే బయటకు రాలేదు. జంతు ప్రేమికుల ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్థానికులతోనూ మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా? కుక్కలను హింసిస్తూ కనిపించారా? అని ఆరాతీస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime, Crime news, Dog, Maharashtra

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు