Home /News /crime /

FEMALE CONSTABLE MURDERED HER HUSBAND IN MUMBAI DUE TO EXTRA MARITAL AFFAIR SSR

Female Constable: ఎంత పనిచేసింది... భార్య కోసం స్టేషన్‌కు భోజనం తీసుకెళ్లిన భర్త.. అప్పుడు తెలిసింది అసలు సంగతి..

నిందితురాలు

నిందితురాలు

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. పెళ్లయిన తర్వాత పర స్త్రీతో, పర పురుషుడితో సంబంధాల కోసం వెంపర్లాడుతూ కొందరు బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణిక సుఖాల మోజులో పడి చేజేతులా కాపురాలను కూల్చుకుంటున్నారు. హత్యలు చేసేందుకు, చేయించేందుకు కూడా వెనకాడటం లేదు.

ఇంకా చదవండి ...
  ముంబై: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. పెళ్లయిన తర్వాత పర స్త్రీతో, పర పురుషుడితో సంబంధాల కోసం వెంపర్లాడుతూ కొందరు బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణిక సుఖాల మోజులో పడి చేజేతులా కాపురాలను కూల్చుకుంటున్నారు. హత్యలు చేసేందుకు, చేయించేందుకు కూడా వెనకాడటం లేదు. ముంబైలో జరిగిన ఈ ఘటన ఓ మహిళా కానిస్టేబుల్ జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రియుడి మోజులో పడి భర్తను చంపించిన ఆమె నేరం చేసి శిక్షను అనుభవిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి సమీపంలోని బాల్కర్‌లో స్నేహల్ పాటిల్ అనే వివాహిత కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త పుండలిక్ పాటిల్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇద్దరికీ వచ్చే సంపాదనతో సుఖంగానే ఉన్న ఈ జంట జీవితంలోకి ఓ వ్యక్తి అనుకోని అతిథిలా వచ్చాడు. స్నేహల్ పనిచేసే పోలీస్ స్టేషన్‌లోనే వికాస్ అనే కానిస్టేబుల్ పనిచేసేవాడు. స్నేహల్‌కు, వికాస్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం హద్దులు దాటి ఇద్దరి మధ్య చనువు పెరిగింది. వీరిద్దరి స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. వికాస్, స్నేహల్ అఫైర్ గురించి స్టేషన్‌లో అందరికీ తెలిసిపోయింది. కానీ.. వ్యక్తిగత విషయం కావడంతో ఎవరూ కలగజేసుకోలేదు. ఈ క్రమంలోనే.. రోజూ స్నేహల్‌కు మధ్యాహ్నం భోజనం ఇచ్చేందుకు ఆమె భర్త పోలీస్ స్టేషన్‌కు వచ్చేవాడు.

  అలా వస్తున్న క్రమంలో.. ఒకరోజు వికాస్, స్నేహల్ అఫైర్ గురించి స్టేషన్‌లో కొందరు మాట్లాడుకోవడాన్ని గమనించాడు. అయితే.. వెంటనే ఇలా మాట్లాడుకుంటున్నారని భార్యను నిలదీయలేదు. నిజమో.. కాదో తెలుసుకోకుండా ఎవరో అన్నారని నిలదీయడం సమంజసం కాదని భావించాడు. అయినప్పటికీ.. ఆ మాటలు పుండలిక్‌ను తొలిచేశాయి. ఇలా కాదని భావించి.. తాను బయటకు వెళుతున్నానని.. రావడం రాత్రవుతుందని భార్యకు అబద్ధం చెప్పాడు. తన భర్త రాత్రి వరకూ రాడని.. మా ఇంటికెళ్లి ఎంజాయ్ చేద్దామని చెప్పడంతో వికాస్.. స్నేహల్ ఇంటికెళ్లాడు. ఇద్దరూ చనువుగా ఉండగా పుండలిక్ చూశాడు. తలుపు తీయగానే.. వికాస్ అక్కడ నుంచి జారుకున్నాడు. వారిద్దరి వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూసిన పుండలిక్.. భార్యను మందలించాడు. మరొక్కసారి ఇలా జరిగితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు. భర్త వార్నింగ్‌తో బెదిరిపోయిన స్నేహల్ ఆ తర్వాత నుంచైనా బుద్ధిగా ఉండాల్సింది పోయి మళ్లీ అదే తప్పు చేసింది. వికాస్‌ను బయట కలుస్తూ తన భర్త ఉంటే కలవడం కుదరదని చెప్పింది. తన భర్తను చంపేయాలని చెప్పింది.

  ఇది కూడా చదవండి: Lovers: నాలుగు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి చెల్లి ప్రేమ పెళ్లి.. ఆమె ఎలా ఉందో చూద్దామని అన్న వెళ్లగా..

  వికాస్ కూడా ఆమె మాట ప్రకారమే తన స్నేహితులైన స్వప్నిల్, అవినాష్‌కు రూ.2.5 లక్షలు ఇస్తానని.. పుండలిక్‌ను మూడో కంటికి తెలియకుండా చంపేయాలని చెప్పాడు. ఆ ఇద్దరూ మరొక వ్యక్తి సహకారంతో పుండలిక్‌ను కస్టమర్ల పేరుతో నమ్మించి.. అతని క్యాబ్ ఎక్కారు. మేనర్‌కు వెళ్లాలని చెప్పారు. తనను చంపడానికి వచ్చారని తెలియని పుండలిక్ వాళ్లు చెప్పినట్టుగానే వెళ్లాడు. మార్గ మధ్యంలో నిర్మానుష్య ప్రదేశంలో ఆపమని చెప్పి.. కత్తితో పొడిచి పుండలిక్‌ను చంపేశారు. నిందితులను విచారించగా.. ఈ కేసులో అసలు నిందితుల పేర్లను బయటపెట్టారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి పుండలిక్ భార్య స్నేహల్ అని, ఏ2 నిందితుడు ఆమె ప్రియుడు వికాస్ అని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ఐదుగురినీ అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం మోజులో పడి భర్తను చంపుకుని, కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పోగొట్టుకుని స్నేహల్ జైలు ఊచలు లెక్కిస్తోంది.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Extra marital affair, Mumbai, Mumbai crime

  తదుపరి వార్తలు