పెళ్లి చేసుకోకపోతే చస్తానంటూ బెదిరింపులు.. నిప్పంటించిన బాలిక..

ఒంటిపై పెట్రోల్ పోసుకుని వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో అప్పటి వరకు విసిగిపోయిన బాలిక వెంటనే అగ్గిపుల్ల గీసి అతడిపై విసిరింది.

news18-telugu
Updated: April 28, 2019, 10:12 PM IST
పెళ్లి చేసుకోకపోతే చస్తానంటూ బెదిరింపులు.. నిప్పంటించిన బాలిక..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 28, 2019, 10:12 PM IST
తనను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అంటూ పదే పదే బెదిరిస్తున్న ఓ యువకుడికి ఎవరూ ఊహించిన షాక్ ఇచ్చిందో బాలిక. తనను పెళ్లి చేసుకోవాలంటూ పెట్రోల్ పోసుకుని బెదిరించిన యువకుడికి ఆ బాలిక నిప్పు అంటించింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. 60శాతం కాలిన గాయాలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఖాద్రాలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నిషాద్ (20) అనే యువకుడు పొరుగింట్లో ఉండే బాలికను ప్రేమిస్తున్నానంటూ గత కొంతకాలంగా వెంటపడ్డాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు ఓ సలహా ఇచ్చారు. మొదట చదువుకోమని సూచించారు. ఆ తర్వాత పెళ్లి చేస్తామని నచ్చజెప్పారు. అయినా సరే మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ బాలిక వెంటపడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో అప్పటి వరకు విసిగిపోయిన బాలిక వెంటనే అగ్గిపుల్ల గీసి అతడిపై విసిరింది. మంటల్లో నిషాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై నిషాద్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

First published: April 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...