Home /News /crime /

Sadist Fathers: కన్న బిడ్డలపైనే కసాయి తండ్రుల కర్కశత్వం.. కాళ్లకు కరెంట్ షాక్ పెట్టి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..

Sadist Fathers: కన్న బిడ్డలపైనే కసాయి తండ్రుల కర్కశత్వం.. కాళ్లకు కరెంట్ షాక్ పెట్టి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

Sadist Fathers: భార్యపై అనుమానంతో  అభం శుభం తెలియని చిన్నారులు బలి తీసుకుంటున్నారు భర్తలు. మూడు రోజుల్లో ఇద్దరు చిన్నారులను చంపిన ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  (K.Veeranna,News18,Medak)

  సిద్దిపేట(Siddipeta) జిల్లా తోగుంట మండలం వెంకటరావుపేట్ గ్రామంలో కంటికి రెప్పలా కాపాడవలసిన కన్నతండ్రి కాల యముడుగా మారి తొమ్మిది నెలల పాపను కాళ్లకు కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. ఇది మరువకముందే.. మరో ఘటన టేక్మాల్ మండలంలో చోటు చేసుకుంది. ఒకప్పుడు కుటుంబంలో ఎలాంటి విభేదాలు చెలరేగినా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే వారు. తమ ప్రాణాలను దార పోసి బతికించుకునే వారు. కానీ నేడు ఈ తీరు మారుతోంది . తనకు పుట్టిన బిడ్డలు అని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా చంపుతున్నారు. భార్యాభర్తలు గొడవ జరిగితే ఒకప్పుడు మరుసటి రోజే సర్దుకుపోయే వారు.. కానీ ఇప్పుడు తమ పిల్లల ప్రాణాలనే చంపుతున్నారు కసాయి తండ్రులు.

  ఉమ్మడి మెదక్ జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెకట్రావుపేటలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకోగా.. తాజాగా మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పాల్వంచలో చిన్నారిని చంపేసిన కసాయి తండ్రి ఘటనలో హంతకుడిని నేడు మెదక్ డీఎస్పీ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పాల్వంచ గ్రామానికి చెందిన బుర్ల రమణయ్య, సావిత్రి 2014 లో వివాహం చేసుకోగా మనస్పర్ధలతో 2016 లో విడిపోయారు. అనంతరం సావిత్రి వేరే వ్యక్తిని వివాహం చేసుకోగా వారికి వర్షిణి అమ్మాయి జన్మించింది. వీరిద్దరి మధ్య కూడా మధ్య మనస్పర్థలు కారణంగా విడిపోయారు.

  అతడికి 25 ఏళ్లు.. పెళ్లైన 7 రోజులకే ఉపాధి కోసం సిటీకి వెళ్లాడు.. 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేసరికి అతడి భార్య..


  సావిత్రి ఉపాధికోసం హైదరాబాద్ వెళ్లగా.. మళ్లీ రమణయ్యను కలిసింది. మనస్పర్థలను పక్కన పెట్టేసి.. విభేదాలను పక్కన పెట్టేసి.. మళ్లీ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సావిత్రి మరల గర్భవతి అయింది. ఆ రోజు నుంచి వర్షిణి తనకు పుట్టలేదనే కారణంతో ద్వేషాన్ని పెంచుకొని, ఎలాగైనా చిన్నారిని అంతమొందిచాలి అని నిర్ణయించుకున్నాడు. మూడు రోజుల క్రితం సావిత్రితో కలిసి టేక్మాల్ ఆసుపత్రికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో భార్యను ముందుగా గ్రామానికి పంపి.. రమణయ్య పథకం ప్రకారం గ్రామ శివారులో నిర్మాణుష్య ప్రాంతానికి చిన్నారిని తీసుకెళ్లి.. గొంతు నులిమి చంపేశాడు.

  Shocking: వాళ్లిద్దరు భార్యాభర్తలు.. కానీ ఆ చిన్న కారణానికి అతడు ఆమెను నడిరోడ్డుపై ఏం చేశాడో తెలుసా..


  తర్వాత ఆ పాప అనారోగ్యంతో మరణించిందని.. గ్రామస్తులకు కట్టు కథను అల్లాడు.  అనుమానంతో భార్య సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసుల దర్యాప్తులో రమణయ్య తానే చిన్నారిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హంతకుడిని రిమాండ్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని  డిఎస్పీ సైదుల్ అన్నారు. ఈ కర్యక్రమంలో  అల్లాదుర్గ్ సీఐ జార్జ్, టేక్మాల్ మండల్ ASI తుకాయా, రవీందర్, సుధాకర్ గౌడ్, స్వామి, లక్ష్మయ్య, రాజశేఖర్, టేక్మాల్ పోలీస్ సిబ్బంది ఐడి పార్టీ సిబ్బంది అరవింద్, మల్లప్ప, డీఎస్పీ సైదుల్ పాల్గొన్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు