Home /News /crime /

FATHERS LOVE ASSAULTS 8 YEAR OLD BOY WITH BURN INJURIES SHOCKING NEWS FROM TAMILNADU NK

తండ్రి ప్రేమే పిల్లాడికి శాపమైందా? తల్లడిల్లిపోతున్న చిట్టి ప్రాణం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పిల్లలవి లేత మనసులు. ప్రపంచపోకడ వారికి తెలియదు. అందరూ మంచివారే అనుకుంటారు. మనుషుల్లోనూ ఆమె లాంటి రాక్షసులు ఉంటారని ఆ చిన్నారికి తెలియదేమో!

  తమిళనాడులోని గుడియాట్టం (Gudiyatham) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందో దారుణం. సవతి తల్లి కాబోతున్న యువతి... ఎనిమిదేళ్ల చిన్నారికి కాల్చి వాతలు (burn injuries) పెట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అంతలా పసి హృదయాన్ని గాయపరచడానికి ఆమె (father love)కు చేతులెలా వచ్చాయని స్థానికులు భగ్గుమంటున్నారు. వివరాలు తెలుసుకుందాం.

  పోలీసులు చెప్పిన దాని ప్రకారం... 35 ఏళ్ల సెత్తు... ఇదివరకు ఈశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఒకరి వయసు పదేళ్లు, మరొకరి వయసు ఎనిమిదేళ్లు. చక్కటి కాపురం. కలిసిమెలిసి హాయిగా జీవించేవారు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత సెత్తు... మరో మహిళకు దగ్గరగా ఉంటుండటాన్ని ఈశ్వరి చూసింది. వివాహేతర సంబంధాలు (extra marital affair) పెట్టుకోవద్దని కోరింది. కానీ సెత్తు ఆమె మాట వినలేదు. తానే సంబంధమూ పెట్టుకోవట్లేదు అంటూనే పక్కింట్లోని వేణీకి దగ్గరవ్వసాగాడు.

  తన భర్త తనకు దూరమవుతుండటాన్ని భరించలేకపోయిన ఆమె... లోలోపల కుమిలిపోతూ... చివరకు నాలుగు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. ఓ నాల్రోజులు ఏడ్చిన సెత్తు... ఆ తర్వాత అదే ఇంట్లోకి వేణీని ఆహ్వానించాడు. వేణీకి మొదటి నుంచి ఈశ్వరి అంటే గిట్టదు. ఆమె పిల్లలన్నా ఇష్టం లేదు.

  షాకింగ్ ఘటన:
  తాజాగా ఎనిమిదేళ్ల చిన్న కొడుకు మంగళవారం పరుగెత్తుకుంటూ వెళ్లి... పెద్దమ్మను కలిశాడు. చేతులు, కాళ్లపై కాలిన వాతలున్నాయి. విపరీతంగా ఏడుస్తూ వీపుని చూపిస్తుంటే... ఏంటా అని ఆమె షర్ట్ విప్పదీసి చూసింది. వీపంతా కందిపోయింది. ఎర్రటి వాతలు కనిపించాయి. షాకైన ఆమెకు మరో విషయం తెలిసింది. మర్మాయవాలైన వృషణాల దగ్గర కూడా వాతలున్నాయి. పెద్దమ్మకు గుండె పగిలింది. చిన్నారి అని కూడా చూడకుండా ఇంతలా వాతలెవరు పెట్టారా అని ఆరా తియ్యగా... ఆ చిన్నారి భయపడుతూనే... కొత్త ఆంటీ అంటూ వేణి విషయం చెప్పాడు.

  ఆస్పత్రిలో చిన్నారి:
  చిట్టి తండ్రిని అప్పటికప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లిన పెద్దావిడ.. ఆ తర్వాత గుడియాట్టం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ప్రస్తుతం చిన్నారికి ట్రీట్‌మెంట్ అందుతోంది. కేసు రాసిన పోలీసులు... వేణితోపాటూ... తండ్రిని కూడా అరెస్టు చేస్తామనీ... దర్యాప్తు చేసి... తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  ఇది కూడా చదవండి: 14 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం.. ఆ విధంగా ఉచ్చులోకి దింపి.!

  ఇలా కాబోయే సవతి తల్లి చేతిలో ఆ చిన్నారి నరకం చూశాడు. ఇలా బొబ్బలు తేలేలా వాతలు పెట్టడానికి ఆమెకు మనసెలా వచ్చిందని ఇరుగుపొరుగువారు మండిపడుతున్నారు. ఇక ఈ ఘటన ఆ చిన్నారి మనసును తీవ్రంగా కలచివేస్తుంది. రేపు పెద్దయ్యాక కూడా ఇది మనసును గాయపరుస్తూనే ఉంటుంది.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Crime news, Crime story, Tamil nadu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు