హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fathers Day tragedy: ఫాదర్స్ డే రోజు తీవ్ర విషాదం.. ఉరి తాడుకు వేలాడుతూ కనిపించిన కూతురు.. ఆ తర్వాత కొద్దిసేటికే..

Fathers Day tragedy: ఫాదర్స్ డే రోజు తీవ్ర విషాదం.. ఉరి తాడుకు వేలాడుతూ కనిపించిన కూతురు.. ఆ తర్వాత కొద్దిసేటికే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫాదర్స్‌డే రోజే ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురు ఉరికి వేలాడుతూ కనిపించడంతో ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది.

ఆదివారం(జూన్ 20) ఫాదర్సడ్ డే చాలా మంది పిల్లలు తమ తండ్రులతో సంతోషంగా గడిపారు. తామే జీవితంగా బతుకుతున్న తండ్రులపై ప్రేమను చాటుకునేలా విషెస్ తెలియజేశారు. సోషల్ మీడియాలో పోస్టులతో తండ్రులపై అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఫాదర్స్‌డే రోజే ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురి ఉరితాడుకు వేలాడటం చూసిన తండ్రి కూడా గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా మళ్లవల్లి తాలూకాలోని తగళవాది గ్రామంలో జరిగింది. వివరాలు.. తగళవాది గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిని నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు.

రాజు చిన్న కూతురు 17 ఏళ్ల బాంధవ్య ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. మైసూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఆమె చదువుతోంది. అయితే కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో.. కూతురు బాంధవ్యను ఇంటర్ సెకండియర్ ప్రభుత్వ కాలేజ్‌లో చదువుకోవాలని తండ్రి రాజు సూచించాడు. అయితే ఇందుకు కూతురు బాంధవ్య అంగీకరించలేదు. తాను ఎలాగైన ఇప్పుడు చదువుతున్న కాలేజ్‌లోనే చదువుకుంటానని చెప్పింది. అయితే దీనిని తండ్రి ఒప్పుకోకపోవడంతో.. బాంధవ్య ఆవేదనకు లోనైంది.

ఇవి చదవండి: Khammam: సెల్‌ఫోన్ విషయంలో అక్కకు, తమ్ముడికి మధ్య గొడవ.. కుటుంబంలో తీవ్ర విషాదం.. అసలేం జరిగిందంటే..

Manikandan Arrested: సినీ నటి ఎఫెక్ట్.. పరారీలో మాజీ మంత్రి.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు..

Telangana: భర్త ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. పెద్దల సమక్షంలో పంచాయితీ.. ఆ సీన్ చూసిన గంట సేపటికే..


ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాజు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కూతురు ఆత్మహత్య చేసుకున్న కొద్దిసేపటికే తండ్రి కూడా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫాదర్స్ డే రోజే తండ్రి, కూతురు ఇలా ప్రాణాలు కోల్పోవడం పలువురిని కంటతడి పెట్టించింది. ఇక, ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.

First published:

Tags: Fathers Day 2021, Karnataka, Suicide

ఉత్తమ కథలు