కూతురుని గర్భవతిని చేసిన తండ్రి...నిజం చెబితే చంపేస్తానంటూ...

ఆమెను లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈవిషయం ఎవరికైనా చెబితే ఆమెతో పాటు తల్లిని చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాధిత యువతి గర్భందాల్చింది.

news18-telugu
Updated: May 29, 2020, 4:43 PM IST
కూతురుని గర్భవతిని చేసిన తండ్రి...నిజం చెబితే చంపేస్తానంటూ...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి వరుసకు కుమార్తె అయిన యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో జరిగింది. ఘజియాబాద్ కు చెందిన ఓ మహిళ భర్తనుంచి విడిపోయి కుమార్తె ( 14)తో కలిసి వేరుగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన సోహన్ సహజీవనం చేస్తోంది. యుక్తవయస్సుకు వచ్చిన ఆమె కుమార్తెపైనా సోహన్ కన్నేశాడు. ఆమెను లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈవిషయం ఎవరికైనా చెబితే ఆమెతో పాటు తల్లిని చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాధిత యువతి గర్భందాల్చింది. సోహన్ ఆమెకు మాత్రలు ఇచ్చి గర్భం పోయేలా చేశాడు. తిరిగి తన కామవాంఛను తీర్చుకోసాగాడు. అతని చేష్టలతో విసిగిపోయిన యువతి జరిగిన విషయాన్ని తల్లికి తెలియజేసింది. మహిళ అతనిని నిలదీయటంతో సోహన్ ఇద్దరిని ఇంటిలో నిర్భందించాడు. అతని చెరనుంచి తప్పించున్న తల్లీకూతుళ్లు పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
First published: May 29, 2020, 4:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading