కృష్ణా జిల్లాలో దారుణం.. పసికందును అమ్మకానికి పెట్టిన తండ్రి..

8 రోజుల పసికందును కన్నతండ్రి అమ్మకానికి పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మామ గొడవకు దిగాడు.

news18-telugu
Updated: October 17, 2019, 7:47 PM IST
కృష్ణా జిల్లాలో దారుణం.. పసికందును అమ్మకానికి పెట్టిన తండ్రి..
కవల ఆడపిల్లలు
  • Share this:
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లిలో దారుణం చోటుచేసుకుంది. 8 రోజుల పసికందును కన్నతండ్రి అమ్మకానికి పెట్టాడు. నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థ నగర్ కు చెందిన రజిత వారం క్రితం ఇద్దరు ఆడ కవలలకి జన్మనిచ్చింది. తొలికాన్పులో ఆమెకు ఓ మగబిడ్డ పుట్టాడు. రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు కావడంతో తండ్రి వారిలో ఒకరిని అమ్మకానికి పెట్టాడు. ఆడపిల్లకు రూ.లక్షన్నర ఇచ్చేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చినట్టు తెలిసింది.అయితే, ఈ విషయం తెలుసుకున్న మామ గొడవకు దిగాడు. మామా అల్లుళ్ల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం రాజేష్, రజిత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆడ కవలలు కావడంతో బిడ్డను అమ్మకానికి పెట్టాడని మామ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు