హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: ఈమె కన్న తండ్రికి అసలు మనసనేది ఉందా.. కూతురి పుట్టినరోజు అని.. ఆమెను పుట్టింటికి పిలిచి..

Shocking: ఈమె కన్న తండ్రికి అసలు మనసనేది ఉందా.. కూతురి పుట్టినరోజు అని.. ఆమెను పుట్టింటికి పిలిచి..

తండ్రి చేతిలో హత్యకు గురైన వివాహిత

తండ్రి చేతిలో హత్యకు గురైన వివాహిత

సోనిపూర్‌లోని రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకీంపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరి ఇళ్లు దగ్గరే. ఒకే గ్రామం కావడంతో ఇరు కుటుంబాలకు ఒకరికొకరు తెలుసు.

సోనిపట్: దేశంలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని తన పరువు తీసిందని భావించిన తండ్రి కన్న కూతురిని హత్య చేసిన అమానవీయ ఘటన హర్యానాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనిపూర్‌లోని రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకీంపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరి ఇళ్లు దగ్గరే. ఒకే గ్రామం కావడంతో ఇరు కుటుంబాలకు ఒకరికొకరు తెలుసు. యువతీయువకుడి కులం కూడా ఒకటే. అయితే.. కూతురు ఆ అబ్బాయిని

ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పింది. కూతురు ఆ యువకుడిని ప్రేమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె తండ్రి ఆ యువకుడితో పెళ్లికి నిరాకరించాడు. అంతేకాదు.. ఆమెకు వేరే పెళ్లి సంబంధాలు కూడా తీసుకొచ్చాడు. దీంతో.. ఆ యువకుడిని మర్చిపోలేకపోయిన సదరు యువతి.. తన ఇంట్లో పరిస్థితులను ఆ యువకుడికి వివరించింది. ఇద్దరూ కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని

నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయి 2020లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ పరిణామంతో కూతురిపై ఆ యువతి తండ్రి మరింత పగ పెంచుకున్నాడు. కూతురుని నమ్మించి చంపేందుకు ఆమె తండ్రి ఓ ప్లాన్ వేశాడు.

జులై 6న కూతురికి ఫోన్ చేసి.. అన్నీ మర్చిపోదామని.. జులై 7న నీ పుట్టినరోజును మాతో కలిసి ఇంట్లో జరుపుకోవాలని.. ఈ పుట్టినరోజు నుంచి కొత్తగా జీవితాన్ని

మొదలుపెడదామని ఆమెకు చెప్పాడు. పిల్లలన్నాక పొరపాట్లు చేయడం సహజమని.. పెద్దలుగా వాటిని మన్నిస్తున్నామని.. ఈ బర్త్ డే రోజున అందరం స్వీట్స్ పంచుకుని కొత్త జీవితం మొదలుపెడదామని చెప్పాడు. తండ్రి మాటలను నమ్మిన ఆమె ఇంటికి వస్తానని చెప్పడంతో జులై 6నే సాయంత్రం సమయంలో ఆమెను కారులో తీసుకెళ్లిన ఆ తండ్రి ఇంటికి వెళ్లలేదు. దారి మధ్యలో కూతురిని గొంతు పిసికి చంపేశాడు.

ఆమె మృతదేహాన్ని మీరట్‌ సమీపంలోని ఓ కాలువలో పడేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత తన భార్యతో ఫోన్ మాట్లాడాలని బాధితురాలి భర్త ఉదయం కాల్ చేశాడు.

అయితే.. కూతురిని చంపేసిన ఆమె తండ్రి ఫోన్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. కూతురి ఫోన్‌ను లిఫ్ట్ చేసిన ఆమె తండ్రి.. ఆమె నిద్రపోతుందని.. ఇంకా లేవలేదని చెప్పాడు. ఆ తర్వాత రోజు మళ్లీ కాల్ చేయగా.. తన అత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్లిందని.. ఫోన్ ఇంట్లో మర్చిపోయిందని చెప్పాడు. దీంతో.. ఆమె భర్త వేదప్రకాష్‌కు అనుమానమొచ్చింది. తన భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ యువతి తండ్రి విజయ్‌పాల్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో తానే చంపి.. కాలువలో పడేశానని విజయ్‌పాల్ అంగీకరించాడు.

First published:

Tags: Crime news, Haryana, Honor Killing, Love marriage, Married women

ఉత్తమ కథలు