• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • FATHER THROWS AWAY 3 MONTHS OLD BABY GIRL INTO FIRE MS

భార్య ఆ పనికి ఒప్పుకోలేదని... కూతురును మంటల్లోకి విసిరిన భర్త..

భార్య ఆ పనికి ఒప్పుకోలేదని... కూతురును మంటల్లోకి విసిరిన భర్త..

ప్రతీకాత్మక చిత్రం

భార్య శృంగారానికి ఒప్పుకోలేదని మూడు నెలల పసికందును మంటల్లోకి విసిరాడు. కూతురు మంటల్లో కాలిపోతున్నా పట్టించుకోకుండా భార్య ను ఆ పని చేయాలని ఒత్తిడి చేశాడు. చిన్న గాయమైతేనే తట్టుకోలేని ఆ చిన్ని పాదాలు.. మంటలో పడి కాలుతున్నా ఆ తండ్రికి కనికరం కరగలేదు.

  • News18
  • Last Updated:
  • Share this:
    కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ భర్త తాను ఏం చేస్తున్నది మరిచాడు. భార్య శృంగారానికి ఒప్పుకోలేదని మూడు నెలల పసికందును మంటల్లోకి విసిరాడు. కూతురు మంటల్లో కాలిపోతున్నా పట్టించుకోకుండా భార్య ను ఆ పని చేయాలని ఒత్తిడి చేశాడు. చిన్న గాయమైతేనే తట్టుకోలేని ఆ చిన్ని పాదాలు.. మంటలో పడి కాలుతున్నా ఆ తండ్రికి కనికరం కరగలేదు. ఈ అమానుష ఘటన బీహార్ లో చోటు చేసకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. బీహార్ లోని ముజఫర్ పూర్ కు చెందిన ఓ మహిళ మూడు నెలల క్రితమే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆదివారం ఇంటికి వచ్చిన ఆమె భర్త.. తనతో శృంగారం చేయాలని అడిగాడు.

    కానీ దీనికి ఆమె ఒప్పుకోలేదు. పక్కన చిన్న పాప ఉందని.. తనకు ఒంట్లో నలతగా ఉందని చెప్పింది. కానీ దీనికి అతడు ఒప్పుకోలేదు. తనకు ఇప్పుడు ఆ పని కావాలని మొండికేశాడు. దీనికి ఆమె ఆమోదించకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ భర్త.. ఆమె ఒళ్లో ఉన్న పసికందును పక్కనే ఉన్న మంటల్లో పడేశాడు.

    ఆమె మంటల్లో పడి విలపిస్తున్నా ఆ కసాయి తండ్రి మనసు కరగలేదు. చివరికి ఆ తల్లి ప్రాణాలకు తెగించి.. ఆ చిన్నారిని ఆహుతి నుంచి బయటకు తీసింది. వెంటనే ఆ పసికందును ఆస్పత్రిలో చేర్పించింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Srinivas Munigala
    First published: