news18-telugu
Updated: October 8, 2020, 7:57 AM IST
ప్రతీకాత్మక చిత్రం
వావి వరసలు లేవు. చిన్నా పెద్దా తేడా లేదు. దేశంలో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. హాథ్రస్ ఘటనపై ఓ వైపు దేశమంతగా భగ్గుముంటున్నా.. మరోవైపు అత్యాచారాల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్లో దారుణం జరిగింది. కన్నకూతురిపైనే తండ్రి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇంట్లో అందరినీ బయటికీ పంపించి కుమార్తె పట్ల పశువులా ప్రవర్తించాడు. మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం వెలుగు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 31 ఏళ్ల వ్యక్తి మల్కాజ్గిరిలో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు కాగా..మరొకరు అబ్బాయి. అతడి భార్య ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది.
ఎప్పటిలానే మంగళవారం సాయంత్రం కూడా ఇళ్లల్లో పనిచేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో తండ్రి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన్న కూతురిపై కన్నేసిన తండ్రి.. పెద్ద కూతురు, కుమారుడికి ఏదో పని చెప్పి బయటకు పంపించాడు. ఇంట్లో తనతో పాటు చిన్న కూతురు మాత్రమే ఉంది. లోపలి నుంచి తలుపు వేసిన తండ్రి.. కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వద్దు డాడీ అని ఏడుస్తున్నా.. వినిపించుకోలేదు. దాదాపు గంట తర్వాత భార్య వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి అతడు బయటకు వెళ్లాడు. ఇంట్లో కూతురి పరిస్థితిని చూసి.. ఏమైందని అడిగింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఏడుస్తూ తల్లికి వివరించింది బాధితురాలు.
ఈ విషయమై భర్తతో గొడవపెట్టుకున్న భార్య.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం రిమాండ్కు తరలించారు. కన్న కూతురి పట్ల పశువులా ప్రవర్తించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడిన అతడు.. ఇతర మహిళలను ఇంకెలా చూస్తాడో అని మండిపడుతున్నారు. అతడిని జైలు నుంచి బయటకు పంపించకూడదని.. అలాంటి వారి వల్ల సమాజానికే ప్రమాదమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
October 8, 2020, 7:54 AM IST