ఆరేళ్ల కూతురిపై కన్నతండ్రి లైంగిక దాడి.. తెలంగాణలో ఘోరం

ఆరేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేశాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంద్రకరణ్ గ్రామానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: September 7, 2020, 8:05 PM IST
ఆరేళ్ల కూతురిపై కన్నతండ్రి లైంగిక దాడి.. తెలంగాణలో ఘోరం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది. తండ్రి అనే బంధానికే మచ్చతెచ్చిన దారుణ ఉదంతమింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామాంధుడయ్యాడు. ఆరేళ్ల కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాను పెంచిన చేతులతోనే ఆ పాపపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో ఈ ఘోరం వెలుగు చూసింది. ఆరేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేశాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంద్రకరణ్ గ్రామానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద నమోదు చేశారు. కన్నకూతురిపైనే దారుణాకి ఒడిగట్టిన ఇలాంటి తండ్రి.. సమాజానికి ప్రమాదకరమని మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: September 7, 2020, 8:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading