నిండు గర్భిణిపై కొందరు దుండగులు దాడి చేశారు. వారిలో దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ.. ఆస్పత్రి పాలయింది. డాక్టర్లు ఆపరేషన్ చేయగా.. అప్పటికే నవజాత శిశువు మరణిచింది. వారు కొట్టడం వల్లే.. ఇలా జరిగిందని.. కేసు పెట్టాలని ఆమె భర్త పోలీసులను ఆశ్రయిస్తే.. వారు పట్టించుకోలేదు. ఎఫ్‌ఐఆర్ కోసం చేసిన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించడంతో .. అతడు తన నవజాత కుమార్తె మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని ఆశ్రయించాడు. స్థానికుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. లక్నోకు చెందిన ధనిరామ్, నీతా భార్యభర్తలు. ధనిరామ్ భార్య గర్భవతి. ఆరు నెలల గర్భంతో ఉన్న ఆమెను ఇద్దరు వ్యక్తులు కొట్టారు. ఆ తర్వాత ఆమె తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.
Software engineer murder: ప్రేమ వివాహం చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య..
ధనిరామ్ తన భార్యను సమీపంలోని నర్సింగ్ హోమ్‌కు తరలించాడు. అక్కడ ఒక వైద్యుడు ఆమెకు శస్త్రచికిత్స చేసి డెలివరీ చేశాదు. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మినిచ్చింది. అయితే పుట్టిన కొద్దిసేపటికే పాప మృతి చెందింది. ఈ క్రమంలో తన భార్యపై దాడి చేపిన గుడ్డు, రామస్వంపై ఫిర్యాదు చేసేందుకు ధనిరామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అతని ఫిర్యాదును నమోదు చేసేందుకు అధికారులు నిరాకరించారు. అనంతరం స్థానికులతో కలిసి తన నవజాత కుమార్తె మృతదేహంతో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రభాకర్ చౌదరి ధనిరామ్‌కు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాల్సిందిగా.. ఫతేహాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించారు.
తన భార్య ఆరు నెలల గర్భంతో ఉన్నదని.. తాను పనికి వెళ్తున్న సమయంలో ఆమెపై దాడికి పాల్పడ్డారని ధనిరామ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వారు కొట్టిన దెబ్బల వల్ల తన భార్య అనారోగ్యం పాలైందని వాపోయాడు. వెంటనే ఆమెను సమీపంలోని నర్సింగ్‌హోమ్‌కు తీసుకు వెళ్లానని.. కానీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో.. అక్కడకు తీసుకెళ్లానని చెప్పారు. డాక్టర్లు తన భార్యకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారని... కానీ నవజాత శిశువు చనిపోయినట్లు ధనిరామ్ చెప్పాడు. కాగా ఆగ్రాలోని లేడీ లియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అతని భార్య చికిత్స పొందుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Up news, Uttar pradesh