కన్న కూతురిని గర్భవతి చేసిన తండ్రి.. 5 నెలలుగా అత్యాచారం చేసి..

వైద్య పరీక్షల్లో ఆమె గర్భం దాల్చినట్లు తేలడంతో డాక్టర్లు షాక్ తిన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడతావా అంటూ తండ్రిని నిలదీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఆస్పత్రికి వెళ్లి బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: July 29, 2020, 6:28 PM IST
కన్న కూతురిని గర్భవతి చేసిన తండ్రి.. 5 నెలలుగా అత్యాచారం చేసి..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది. కన్నకూతురినే అత్యాచారం చేసి, ఆమెను గర్భవతిని చేసిన రాక్షసుడి ఉదంతం ఇది. విశాఖపట్టణంలో ఈ ఘోరం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల బాధితురాలు విశాఖ రైల్వే న్యూకాలనీలో తండ్రి, నానమ్మ, తాతయ్యతో కలిసి నివసిస్తోంది. కొన్ని రోజుల క్రితం తల్లి మరణించింది. ఐతే తల్లి లేని బిడ్డను అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే.. రాక్షసుడిగా మారాడు. కూతురికి మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 5 నెలలుగా ఇంట్లోనే ఆమెకు నరకం చూపిస్తూ.. పలుమార్లు రేప్ చేశాడు.

ఐతే ఇటీవల బాలిక అనారోగ్యానికి గురవడంతో పాటు శరీరంలో మార్పులు చోటుచేసుకోవడంతో.. తండ్రే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షల్లో ఆమె గర్భం దాల్చినట్లు తేలడంతో డాక్టర్లు షాక్ తిన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడతావా అంటూ తండ్రిని నిలదీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఆస్పత్రికి వెళ్లి బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ ఈ కేసు బాధ్యతలను తీసుకున్నారు. కన్న కూతురినే గర్భవతి చేసిన ఆ తండ్రిని ఉరితీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: July 29, 2020, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading