సమాజంలో రోజు రోజుకు ఆడపిల్లలకు రక్షణ కరువు అవుతుంది. ఒంటరిగా బయటకు పంపాలన్నా, చివరికి ఇంట్లో ఉన్నా భయపడే పరిస్ధితులు వచ్చాయి. బాధ్యతగా మెలగాల్సిన.. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. కూతురిపై అత్యాచారం చేశాడు. రక్తం పంచుకు పుట్టిన కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడి చేస్తూ పైశాచికత్వం పొందిన ఘటన 2018లో ఏపీ (Andhra Pradesh) వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కామాంధుడిగా మారిన భర్త నుంచి కూతురిని కాపాడాల్సిన కన్నతల్లి.. కూతురిపై లైంగిక దాడి చేసేందుకు భర్తకు సహకరించింది. బాధిత బాలిక చిన్నాన్న, నానమ్మను ఆశ్రయించడంతో ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది.. నాలుగు సంవత్సరాలుగా కోర్టులో వాదోపవాదనలు జరిగి నేడు చిత్తూరు పోక్సో కోర్టు నిందుతులకు జీవిత ఖైదు ( Life imprisonment) విధిస్తూ, వెయ్యి రూపాయలు జరిమానా విధించింది
Yanam: యానాంలో మితిమీరిపోతున్న గంజాయి అమ్మకాలు..! కారణం ఇదే..?
వివరాల్లోకి వెళ్ళితే.. చిత్తూరు (Chittoor) జిల్లా పలమనేరు మండలంకు చెందిన కృష్ణమూర్తి, ధనమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ జంటకు ఓ కూతురు ఉంది. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో కృష్ణమూర్తి, ధనమ్మ దంపతులు ఎంతో గారాభంగా చూసుకునేవారు. అయితే కృష్ణమూర్తి.. మద్యానికి బానిసగా మారి రోజు త్రాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో కృష్ణమూర్తికి తన రక్తం పంచుకుని పుట్టిన పదేళ్ళ కుమార్తెపై కన్ను పడింది. ఎలాగైనా కూతురితో తన కామవాంఛ తీర్చుకోవాలని భావించిన కృష్ణమూర్తి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెను భయపెట్టి లైంగికంగా దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ భయాందోళనకు గురి చేశాడు. కన్నతండ్రే తన పాలిట కామంతో దాడి చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయపడుతూ విషయాన్ని ఇంటికి వచ్చిన తల్లికి తెలియజేసింది. కన్న కుమార్తెపై లైంగిక దాడి చేసిన తండ్రిని.. మందలించాల్సిన తల్లే.. భర్తకు సహకరిస్తూ మూడేళ్ళు పాటు కుమార్తెపై భర్త కామ కోరికలు తీర్చుకునేందుకు సహకరించింది.
కన్నవారే తన పాలిట క్రూరంగా ప్రవర్తించడం తట్డుకోలేని ఆ పదేళ్ళ బాలిక తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంను చూసి చిన్నాన్న, నానమ్మకు విషయాన్ని చెప్పి బోరున విలపించింది. వారిద్దరు బాలికను నేరుగా సిడబ్ల్యూసి కార్యాలయంకు తీసుకెళ్ళి విచారణ జరిపించిన తరువాత పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పలమనేరు పోలీసులు కృష్ణమూర్తి, ధనమ్మలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికపై మూడు సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడిన సాక్షాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.. అయితే దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. పబ్లిక్ ప్రసిక్యూటర్ లీలావతి వాదనతో పోక్సో కోర్టు న్యాయమూర్తి శాంతి ఏకీభవించారు. నేరం రుజువు కావడంతో నిందుతులైన కృష్ణమూర్తి, ధనమ్మలకు జీవిత ఖైదు విధిస్తూ, వెయ్యి రూపాయలు జరిమాన విధించింది. అంతే కాకుండా బాలికకు మూడు లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పును వెల్లువరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chittoor, Crime news, RAPE