Home /News /crime /

Daughter: రోజూ పనికి వెళ్లే తల్లి.. ఇంట్లో నుంచి కూతురి అరుపులు.. అనుమానంతో పక్కింటి మహిళ వచ్చి చూస్తే..

Daughter: రోజూ పనికి వెళ్లే తల్లి.. ఇంట్లో నుంచి కూతురి అరుపులు.. అనుమానంతో పక్కింటి మహిళ వచ్చి చూస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Daughter: అనారోగ్యం కారణంగా తల్లి 6 రోజులు ఆసుపత్రిలో చేరింది. ఇంతలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 9 ఏళ్ల ఆమె కూతురికి ఊహించని పరిణామం ఎదురైంది.

  తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కూతురు ఇంట్లో ఉంటోంది. తల్లి ఆరోగ్యం ఎలా ఉందో అని ఆలోచిస్తూ తిండి తిప్పలు మానేసింది. ఇలాంటి సమయంలో కూతురికి ధైర్యం చెప్పాల్సిన ఆ తండ్రి బుద్ధి పక్కదారి పట్టింది. తొమ్మిదేళ్ల తన అమాయక కూతురిపై తండ్రి మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. అనారోగ్యం కారణంగా తల్లి 6 రోజులు ఆసుపత్రిలో చేరింది. ఇంతలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 9 ఏళ్ల కుమార్తెపై ఆమె తండ్రి ఉద్దేశ్యం మరింత దిగజారింది. తండ్రి మొదట కూతురిని చాలా బెదిరించాడు. ఆపై ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆ కీచక తండ్రి ఆగలేదు. భార్య కోలుకుని ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆమె ఇంట్లో లేని సమయం చూసి ఈ దుర్మార్గమైన పనికి ఒడిగడుతూ వచ్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా రాంపూర్ పోలీస్ చౌకీ ప్రాంతంలో జరిగింది. నిందితుడైన వ్యక్తి ఓ ఆటో డ్రైవర్‌.

  వివరాల్లోకి వెళితే.. మూడు నెలల క్రితం నిందితుడి భార్య అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రిలో చేరింది. దాదాపు 6 రోజుల పాటు అక్కడ చికిత్స పొందారు. ఇంతలో ఆమె తొమ్మిదేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. మొదటి రోజు తన తండ్రి అనవసరంగా దూషిస్తూ చిత్రహింసలు పెట్టాడు. రెండో రోజు రాత్రి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత అతడిలో మనోధైర్యం పెరిగి బాలికపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు.ఆసుపత్రి నుంచి కోలుకుని వచ్చిన తర్వాత భార్య ఫ్యాక్టరీలో పనికి వెళ్లేది.

  ఈ సమయంలో ఆమె తండ్రి పిల్లలపై అత్యాచారం చేసేవాడు. ఈ క్రూరత్వం సుమారు మూడు నెలల పాటు కొనసాగింది. ఈ కేసులో నిందితుడైన తండ్రిపై రాంపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరుగుపొరుగున ఉండే ఓ మహిళ కారణంగా ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి కూలికి వెళ్లిన తర్వాత ఆమె తండ్రి పెద్ద గొంతుతో దుర్భాషలాడడం ఆమె చూసేది. తండ్రి నీతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని బాలికను ప్రశ్నించింది.

  KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..

  ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?

  Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

  మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

  తల్లికి ఈ విషయం చెప్పావా అని అడిగింది. ఆమె తల్లి పని నుండి ఇంటికి తిరిగి రావడంతో ఈ విషయం ఆమె చెవికి చేరింది. ఇంట్లోకి చేరుకోగానే కూతురు చెప్పిన విషయాలు విని ఆ తల్లి ఎంతో బాధపడింది. ఈ దారుణాన్ని సహించకూడదని నిర్ణయించుకుని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అయితే తనను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని తెలుసుకున్న నిందితుడు.. అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Crime news, Sexual harrassment

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు