FATHER PHYSICALLY ABUSES MINOR DAUGHTERS IN BIHAR SNR
OMG:మైనర్ కూతుళ్లపై తండ్రి ఘాతుకం..విటమిన్ టాబ్లెట్స్ పేరుతో మత్తుబిళ్లలిచ్చి..
ప్రతీకాత్మకచిత్రం
OMG:బిహార్‌లో ఓ తండ్రి మైనర్ కూతుళ్ల పాలిట కామోన్మాదిగా మారాడు. మగసంతానం కలుగుతుందన్న తాంత్రికుడి మాటలు విని కుమార్తెలకు మత్తు బిళ్లలు ఇచ్చి కామవాంచ తీర్చుకున్నాడు. బాధిత బాలికలు తండ్రి కిరాతకంపై ఏకంగా గవర్నర్, సీఎంకి లేఖ రాయడంతో బయటపడింది.
తండ్రి అంటే సంరక్షించే వాడని అర్ధం. కాని వాడు కన్నబిడ్డల్నే కాటేశాడు. కామంతో కళ్లు మూసుపోయి..మగసంతానం కోసం వావి, వరసలు మర్చిపోయాడు. ఓ తాంత్రికుడి మాటలు విని మైనర్‌గా ఉన్న కూతుళ్ల(Minor daughters)పై లైంగిక వేధింపుల(Physically abuses)కు గురి చేశాడు. సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్న ఈఘటన బిహార్(Bihar)లోని బక్సర్(Buxar)జిల్లా రాజ్పూర్ (Rajpur) మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నబిడ్డలకు విటమిన్ టాబ్లెట్స్(Vitamin tablets)పేరుతో మత్తు బిళ్లలు(Anesthetic tablets)ఇచ్చి ఓ తాంత్రికుడితో అత్యాచారం చేయించాడు. అటుపై తాను కూడా లైంగికదాడికి పాల్పడేవాడు.
కన్నతండ్రే కామాంధుడు..
తండ్రి విటమిన్ టాబ్లెట్ల పేరుతో మత్తు బిళ్లలు ఇచ్చి తన స్నేహితుడైన తాంత్రికుడితో అత్యాచారం చేయించడాన్ని గుర్తించారు కూతుర్లు. వాళ్లు చేస్తున్న చర్యలను ఎదురు ప్రశ్నించినా..తిరస్కరించినా బాధిత బాలికలను కొట్టడం, చిత్రహింసలకు గురి చేసేవాడు. తండ్రి, తాంత్రికుడి వేధింపులు భరించలేకపోయారు బాలికలు. కనీసం ఇంట్లో ఉన్న తల్లి, మేనత్త సైతం తండ్రి, తాంత్రికుడు పాల్పడుతున్న దారుణాలకు అడ్డుచెప్పకపోగా వాళ్లకు సహాకరించే వారు. కామాంధుల మధ్య ఇంట్లో ఉండలేకపోయిన మైనర్ బాలికలు ఇల్లు వదిలిపారిపోయారు. బక్సర్ జిల్లా కేంద్రంలో ఓ గది అద్దెకు తీసుకొని అందులో నివసించారు. ఎలాగైనా తండ్రి చేసిన ఘాతుకాన్ని బయటపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి,గవర్నర్‌తో పాటు జిల్లా కలెక్టర్‌కి సైతం లేఖ రాశారు. లేఖతో తమకు జరిగిన అన్యాయం, తండ్రి పెట్టిన చిత్రహింసల గురించి వివరంగా రాశారు. ఎలాగైనా ఈ సమస్య నుంచి తమను కాపాడి..తండ్రి, తాంత్రికుడికి తగిన బుద్ధి చెప్పాలని, వాళ్లిద్దరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బిడ్డల్ని కాటేసిన ఉన్మాది..
బాలికల ఫిర్యాదు మేరకు బక్సర్ జిల్లా ఎస్పీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తండ్రి తాంత్రికుడితో పాటు మరో ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తండ్రి, తాండ్రికుడే కాదు బాలికల తల్లి, అత్త పాత్ర కూడా ఉందని తెలిసి అందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించారు. కొడుకు పుట్టాలన్న ఆశతోనే బాలికల తండ్రి ఇలా తాంత్రికుడితో కలిసి బరితెగించాడని ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇలాంటి హేయమైన చర్యలకు భవిష్యత్తులో మరెవరూ పాల్పడకుండా ఉండేలా మైనర్ బాలిక తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, తాంత్రికుడ్ని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, బాలల హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.