కోడి కోసం హత్య... కొడుకును చంపిన తండ్రి...

Andhra Pradesh : వింత వైరస్‌లతో కోళ్లు చనిపోతున్న వార్తలు వింటున్నాం. అలాంటిది కోడి కోసం తండ్రి కొడుకును చంపుకోవడమేంటి? అలా ఎందుకు జరిగింది? ఏం జరిగింది?

news18-telugu
Updated: February 24, 2020, 7:16 AM IST
కోడి కోసం హత్య... కొడుకును చంపిన తండ్రి...
కోడి కోసం హత్య... కొడుకును చంపిన తండ్రి... (File)
  • Share this:
Andhra Pradesh : కోడి కోసం జరిగిన గొడవ... చివరకు హత్యగా మారింది. ఆవేశంతో రగిలిపోయిన తండ్రి... తన కొడుకునే చంపుకున్నాడు. ఈ చిత్రమైన ఘటన జరిగింది విజయనగరం జిల్లాలోని బొద్దిడి గ్రామంలో. ఎలా జరిగిందంటే... 22 ఏళ్ల మద్దేశ్వరరావు కుక్కను పెంచుకోవాలనుకున్నాడు. ఐతే... ఎవరో చెప్పారు... కుక్కలకు కోపం వస్తే... పెంచిన వాళ్లను కూడా కరుస్తాయని. అది నిజం కాదని అనుకున్నా... లేనిపోని రిస్క్ ఎందుకనుకున్న మద్దేశ్వరరావు... కుక్క బదులు... కోడిని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ మంచి కోడిని కొని తెచ్చుకున్నాడు. రోజూ దాన్ని చక్కగా చూసుకుంటూ... దానికి మంచి ఆహారం పెడుతూ... దాదాపు దాన్ని కన్న బిడ్డలా సాగుతున్నాడు. ఓ రోజు మద్దేశ్వరరావు తండ్రి కాంతారావు... తనతోపాటూ... సరదాగా కోడిని బయటకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. అలా తీసుకెళ్తూ... ఊర్లో చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ చెరువు దగ్గర నీటి బాతులు నీటిలో తలపెట్టి... ఎక్కువ సేపు అలాగే ఉంటూ... తిరిగి పైకి రావడం చూశాడు. బాతులైతే అంత సేపు ఉండగలుగుతున్నాయి. మరి కోడి ఉండగలదా అన్న డౌట్ వచ్చింది. కోడిని తీసుకెళ్లి... చెరువులో ముంచాడు. కాసేపు అలా ఉంచి బయటకు తీశాడు. అప్పటికే నీటిలో ఊపిరాడక ఆ కోడి చచ్చిపోయింది.

ఆ తర్వాత కాంతారావు మౌనంగా ఇంటికి వచ్చాడు. కోడి విషయం చెప్పకుండా సైలెంట్‌గా ఉన్నాడు. కొడుకుకేమో కోడి కనిపించకపోతే చేతులాడవు. నాన్నా కోడి కనిపించట్లేదు... నువ్వేమైనా చూశావా అని అడిగాడు. తండ్రి ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు. అంతే... మద్దేశ్వరరావుకి మండిపోయింది. "నీకసలు బుద్ధుందా... ఎవడైనా కోడిని తీసుకెళ్లి చెరువులో ముంచుతాడా... అన్నం తింటున్నావా.. గడ్డి తింటున్నావా"... అంటూ ఆవేశంలో అడ్డమైన తిట్లూ తిట్టాడు. అంతే... తండ్రికి పట్టరాని కోపం వచ్చేసింది. ఏంట్రా బోడి కోడి కోసం నన్నే తిడుతున్నావ్. ఏమనుకుంటున్నావ్... అంటూ రివర్సయ్యాడు. వెంటనే మద్దేశ్వరరావు... "మరి తిట్టక ముద్దెట్టుకుంటారా. ముదనష్టపు పనులు చేస్తుంటే" అంటూ కయ్యి కయ్యి మన్నాడు.

తండ్రికి పిచ్చి కోపం వచ్చింది. ఆయన పక్కనే ఓ కత్తి ఉంది. వెంటనే దాన్ని పట్టుకొని... కొడుకు చాతిలో కసక్కున దింపాడు. అసలే అది చాలా పదునైన కత్తి... ఈజీగా బాడీలో దిగిపోయింది. తర్వాత రక్తం కారడం... మద్దేశ్వరరావు విలవిలలాడటం అన్నీ జరిగాయి. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్తుంటే... మధ్యలోనే చనిపోయాడు. విషయం తెలిసిన కాంతారావు... ఇంట్లోంచీ పారిపోయాడు. పోలీసులు కేసు రాసి... కాంతారావు కోసం వేటాడుతున్నారు. ఇలా ఒకే రోజు ఆ ఇంట్లో... రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు