Home /News /crime /

FATHER KILLS HER SON BY ATTACKING WITH STICK IN GUNTUR SK

కొడుకుని రోకలి బండతో కొట్టిచంపిన తండ్రి.. గుంటూరులో ఘోరం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కుమారుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి.. వంట గదిలో ఉన్న రోకలి బండతో అతడి తలపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అశోక్ అక్కడికక్కడే మరణించాడు.

    మద్యం మత్తులో తండ్రీకొడుకులు గొడవపడ్డారు. మాటా మాటా పెరిగి పరస్పరం కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే కుమారుడిని రోకలి బండతో కొట్టి చంపాడు తండ్రి. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో చోటుచేసుకుంది. నిడుబ్రోలు 12 వార్డుకు చెందిన కొక్కిలిగడ్డ అశోక్ మద్యం మత్తులో తండ్రీతో గొడవపడ్డాడు. అప్పటికే అతడు కూడా తాగి ఉన్నాడు. ఇంట్లో పరిస్థితి విషయంలో పరస్పరం దూషించుకున్నారు. గొడవ పెద్దదై ఒకరినొకరు కొట్టుకున్నారు. కుమారుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి.. వంట గదిలో ఉన్న రోకలి బండతో అతడి తలపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అశోక్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur

    తదుపరి వార్తలు