పిన్‌తో పొడిచి పీక కొరికి... కన్నబిడ్డ దారుణ హత్య

పిల్లల కోసం భార్యాభర్తలు ఎంతో తపిస్తుంటారు. ఎక్కడో కొన్ని జంటలు మాత్రం పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఉంటాయి.

రెండు మూడు రోజుల్లో వచ్చి బిడ్డను తనతోపాటు తీసుకువెళ్తానని భార్య స్వప్న తెలిపింది. దీంతో కొడుకును భార్య తీసుకువెళ్తుందన్న సమాచారం కన్నయ్యకు తెలిసి రగిలిపోయాడు.

 • Share this:
  కన్నబిడ్డల్ని ఏ కష్టం లేకుండా పెంచాల్సిన తండ్రే హతమార్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని కర్కశంగా కన్నతండ్రే హతమార్చిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. బాలుడి గొంతునులిమి, కొరికి దారుణంగా హతమార్చాడు. హృదయవిదారకమైన ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో శుక్రవారం జరిగింది. సూర్యాపేట అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చింతల కనకయ్యకు స్వప్న దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కూతురు అక్షితకు ఆరేళ్లు, కొడుకు అక్షయ్‌కు నాలుగేళ్లు. బతుకుతెరువు కోసం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి నివాసం ఉంటున్నారు. నెలరోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కొడుకును తీసుకుని కన్నయ్య సొంతూరిలోని పెదనాన్న చింతల రాములు ఇంటికి వచ్చేశాడు. కూలిపనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు.

  కనకయ్య జులాయిగా తిరుగుతూ తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి వేధిస్తుండటంతో భార్య కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కుమారుడు మాత్రం కనకయ్యే వద్దే ఉంటున్నాడు. నెల రోజుల కిందట కనకయ్య తన పెద్ద నాన్నైన చింతల రాములు నివాసముంటున్న శాలిగౌరారం మండలం తిరుమలరాయినిగూడెం వచ్చాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. చిన్నా చితక పని చేస్తూ వచ్చిన డబ్బులతో తాగుతున్నాడు. అక్షయ్‌ బాగోగులు చూడడానికి ఇబ్బందిగా ఉందని, వచ్చి తీసుకువెళ్లాలని రాములు కుటుంబ సభ్యులు స్వప్నకు సమాచారం అందించారు. దీంతో రెండు మూడు రోజుల్లో వచ్చి బిడ్డను తనతోపాటు తీసుకువెళ్తానంది స్వప్న. కొడుకును భార్య తీసుకువెళ్తుందన్న సమాచారం కన్నయ్యకు తెలిసి రగిలిపోయాడు.

  మద్యం మత్తులో గురువారం అర్ధరాత్రి కనకయ్య తన కుమారున్ని గొంతు నులిమి, గోళ్లతో నొక్కి, పిన్‌లతో పొడిచాడు. అంతటితో ఆగకుంా పసివాడి పీక కొరికి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. ఉదయం అక్షరును నిద్ర లేపేందుకు వెళ్లిన రాములు చూసి బోరున విలపించాడు. ఘటనా స్థలాన్ని శాలిగౌరారం సీఐ క్యాస్ట్రోరెడ్డి సందర్శించారు. రాములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజు తెలిపారు. పరారీలో ఉన్న కనకయ్య కోసం గాలిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారిని కన్నతండ్రే దారుణంగా హతమార్చడం చూసి చుట్టుపక్కల వాళ్లంతా తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
  Published by:Sulthana Begum Shaik
  First published: