హోమ్ /వార్తలు /క్రైమ్ /

NarmadaCanal: ఇదెక్కడి పెళ్లి పిచ్చి.. ఈ ప్రబుద్ధుడు మూడో పెళ్లి కోసం ఎంత మూర్ఖపు పని చేశాడో తెలిస్తే..

NarmadaCanal: ఇదెక్కడి పెళ్లి పిచ్చి.. ఈ ప్రబుద్ధుడు మూడో పెళ్లి కోసం ఎంత మూర్ఖపు పని చేశాడో తెలిస్తే..

నిందితుడు ధామేష్

నిందితుడు ధామేష్

సనంద్ తాలూకా ఖోడా గ్రామానికి చెందిన ధామేష్ దేవీపూజక్‌కు (35) గతంలోనే రెండు పెళ్లిళ్లయ్యాయి. అయితే.. ఒక పాప పుట్టిన కొన్నాళ్లకు మొదటి భార్య చనిపోయింది. ఆ తర్వాత ధామేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కూడా వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఏడేళ్ల వయసున్న కూతురిని చూసుకుంటూ ఉన్న ధామేష్‌కు మళ్లీ పెళ్లిపై గాలి మళ్లింది.

ఇంకా చదవండి ...

అహ్మదాబాద్: మూడో పెళ్లి చేసుకోవాలన్న వ్యామోహంలో ఓ తండ్రి కన్న కూతురినే హత్య చేశాడు. తనకు పెళ్లి సంబంధాలు రాకపోవడానికి ఆ ఏడేళ్ల పాప అడ్డంకిగా ఉందని భావించిన ఆ కిరాతక తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌ పరిధిలోని సనంద్ తాలూకా ఖోడా గ్రామానికి చెందిన ధామేష్ దేవీపూజక్‌కు (35) గతంలోనే రెండు పెళ్లిళ్లయ్యాయి. అయితే.. ఒక పాప పుట్టిన కొన్నాళ్లకు మొదటి భార్య చనిపోయింది. ఆ తర్వాత ధామేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కూడా వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఏడేళ్ల వయసున్న కూతురిని చూసుకుంటూ ఉన్న ధామేష్‌కు మళ్లీ పెళ్లిపై గాలి మళ్లింది. కొన్ని నెలలుగా పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే.. ఏ సంబంధం కూడా కుదరడం లేదు. అందుకు తన దగ్గర ఏడేళ్ల కూతురు ఉండటమే కారణమని భావించిన ధామేష్ రాక్షసంగా మారాడు. ఆ పాపను అడ్డుతొలగించుకుంటే గానీ తనకు పెళ్లి కుదరదని నిర్ణయానికొచ్చాడు. అయితే.. ఆ హత్య కేసులో ఇరుక్కోకుండా కూతురిని చంపాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే జులై 9న సనంద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ధామేష్ తాను తాగిన మత్తులో ఉన్నానని.. తన కూతురిని ఎక్కడ వదిలేశానో గుర్తులేదని పోలీసులకు చెప్పాడు. కనిపించకుండా పోయిన తన కూతురిని వెతికిపెట్టాలని పోలీసులను వేడుకున్నాడు. దీంతో.. పోలీసులు వెంటనే పాప ఆచూకీ కోసం వెతుకులాట సాగించారు.

జులై 10న పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ధామేష్ మరో కొత్త కథ అల్లి పోలీసులకు వినిపించాడు. అసలేం జరిగిందో గుర్తొచ్చిందని.. హన్సల్‌‌పూర్ దగ్గర్లోని మార్కెట్‌కు తన కూతురితో కలిసి వెళ్లొస్తుండగా.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన కూతురిని అపహరించారని చెప్పాడు. జులై 11న మరో కొత్త కథతో ధామేష్ పోలీసుల ముందుకొచ్చాడు. తాను, తన కూతురు ఓ వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లను తిన్నామని.. అవి తిన్నాక స్పృహ కోల్పోయామని.. స్పృహలోకి వచ్చి చూసేసరికి నర్మద కాలువ దగ్గర్లో ఉన్నానని చెప్పాడు.

ఇది కూడా చదవండి: Shocking: ‘అబ్బాయి నల్లగా ఉన్నాడు.. నాకు నచ్చలేదు.. ఈ పెళ్లొద్దు’ అని చెల్లి చెబితే ఏ అన్న అయినా ఇలా చేస్తాడా..!

పోలీసులు ఆ చాక్లెట్లు ఇచ్చిన వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా అలాంటిదేమీ జరగలేదని తేలిపోయింది. అదేరోజున.. పోలీసులకు నర్మద కాలువ దగ్గర ధామేష్ కూతురి మృతదేహం లభ్యమైంది. దీంతో.. ధామేష్‌కు సమన్లు జారీ చేసిన పోలీసులు అతనిని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. తనకు పెళ్లి కాకపోవడానికి కూతురే కారణమని భావించి తనను నర్మదా కాలువలోకి తోసి చంపేసినట్లు ధామేష్ ఒప్పుకున్నాడు. పోలీసులు ధామేష్‌ను అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

First published:

Tags: Ahmedabad, Crime news, Gujarat, Murder

ఉత్తమ కథలు