హోమ్ /వార్తలు /క్రైమ్ /

Honor Killing: మరో పరువు హత్య.. కన్న కూతురు గొంతు కోసి..

Honor Killing: మరో పరువు హత్య.. కన్న కూతురు గొంతు కోసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Honor Killing: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. పరుపు పోయిందన్న కారణంతో ఓ 16 ఏళ్ల బాలికను ఆమె కన్న తండ్రి, సొంత అన్నే దారుణంగా హత్య చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

  దేశ వ్యాప్తంగా పరువు హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్ లో హేమంత్ హత్య ఘటన మరవక ముందే, యూపీలోని హత్రాస్‌ లో దళిత యువతిపై అఘాయిత్యం, హత్యపై ఆందోళనలు ఆగక ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. పరుపు పోయిందన్న కారణంతో ఓ 16 ఏళ్ల బాలికను ఆమె కన్న తండ్రి, సొంత అన్నే దారుణంగా హత్య చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. షహజన్‌పూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలిక ఓ బంధువు వద్ద ఉండేది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే బాలికను ఎవరు మోసం చేశారనే విషయం తెలియలేదు. ఆ బాలిక గర్భం దాల్చడంతో తమ కుటుంబం పరువు పోయిందని భావించిన ఆమె తండ్రి, సోదరుడు ఆమెను చంపేయాలని భావించారు.

  ఈ క్రమంలో వారు ఆ బాలికను దారుణంగా కొట్టి, గొంతు కోసి చంపారు. దీంతో సెప్టెంబర్‌ 23న బాలిక అదృశ్యం కాగా, మంగళవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి నది ఒడ్డున ఖననం చేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులెవరూ ఈ దారుణంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అయితే బాలికను అత్యంత కిరాతకంగా హింసించి.. గొంతు కోసి చంపినట్ల పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల విచారణలో మృతురాలి తండ్రి తానే ఈ నేరానికి పాల్పడ్డానని అంగీకరించారు.

  తన కూతురు గర్భం దాల్చడంతో స్థానికులు తనను అవమానిస్తున్నారని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఆ కారణంతోనే తన బిడ్డను తానే చంపేశానని ఒప్పుకున్నాడు. ఈ కేసులో మరో నిందితుడు.. బాధిత బాలిక సోదరుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. బాలిక తండ్రి, సోదడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షహజన్‌పూర్‌ ఎస్‌ఎస్పీ ఆనంద్‌ తెలిపారు. పరారీలో ఉన్న బాలిక సోదరుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. అయితే ఈ కేసులో బాలిక తల్లి, ఇతర బంధువులను సైతం ప్రశ్నించామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఈ హత్యలో వారి ప్రమేయం ఉన్నట్లు తేలలేదన్నారు. బాలికపై లైంగికంగా దాడి చేసి గర్భం దాల్చడానికి కారణమైన వారిని కూడా విడిచిపెట్టేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Honor Killing, Uttar pradesh

  ఉత్తమ కథలు