హోమ్ /వార్తలు /క్రైమ్ /

నా కూతురు నీకు పుట్టింది కాదు.. అని భార్య తేల్చిచెప్పడంతో ఆ భర్త ఏం చేశాడంటే..

నా కూతురు నీకు పుట్టింది కాదు.. అని భార్య తేల్చిచెప్పడంతో ఆ భర్త ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

’ఇది నా కూతురు. నీకు పుట్టింది కాదు. నువ్వు ఈ పాపకు తండ్రివి కాదు‘ అని నోరు జారింది. అంతే ఆ భర్తలో కోపం కట్టలు తెంచుకుంది. తీవ్ర ఆగ్రహంతో కొద్ది రోజుల పాటు తనలో తానే ఆలోచించుకోసాగాడు. చివరకు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే..

ఇంకా చదవండి ...

  మీరు ’నోటా‘ సినిమా చూశారా.? అందులో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తే, అతడి తండ్రి పాత్రలో నాజర్ నటించాడు. ఒకనొక సన్నివేశంలో నాజర్ తో అతడి భార్య పాత్రధారి కొన్ని మాటలు అంటుంది. ’వీడు నీకే పుట్టాడని గ్యారంటీ ఏంటి‘ అని ప్రశ్నిస్తుంది. ఆ ఒక్క ప్రశ్నతో తన జీవితాంతం ’వీడు నా కొడుకునా..?‘ అని సందేహంలోనే ఉండిపోతాడు. అచ్చం అదే రీతిలో ఓ రియల్ స్టోరీలో జరిగింది. ఈ పాప నీకు పుట్టలేదు.. అని భార్య చెప్పడంతో ఆ భర్తలో కోపం కట్టలు తెంచుకుంది. భార్యతో రోజూ గొడవ పడుతూ, కూతురి గురించి ఆలోచిస్తూ చివరకు ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. భార్యపై కోపాన్ని ఆ పసిపాపపై చూపించాడు. ఆ ఐదేళ్ల పాపను కడతేర్చాడు. గుజరాత్ లో జరిగిన ఈ ఘోర సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో ముజ్కువ గ్రామ పరిథిలో శైలేష్ పదియార్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య ఐదేళ్ల కూతురు ఉంది. అయితే కొంత కాలంగా భార్యకు, అతడికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నీకు అక్రమ సంబంధం ఉందంటే, నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ భార్యాభర్తలిద్దరూ పరస్పరం వాదులాడుకుంటున్నారు. ఈ గొడవలోనే పొరపాటున ఆ భార్య ఓ మాట జారింది. ’ఇది నా కూతురు. నీకు పుట్టింది కాదు. నువ్వు ఈ పాపకు తండ్రివి కాదు‘ అని నోరు జారింది. అంతే ఆ భర్తలో కోపం కట్టలు తెంచుకుంది. తీవ్ర ఆగ్రహంతో కొద్ది రోజుల పాటు తనలో తానే ఆలోచించుకోసాగాడు. చివరకు ఈ సోమవారం జనవరి 25న కూతుర్ని తనతోపాటు పొలానికి తీసుకెళ్లాడు. ఆ పాప ధరించే బెల్టుతోనే ఉసురు తీశాడు. కాలవలోనే కూతురి మృతదేహాన్ని పారేశాడు.

  ఆ తర్వాత తీరిగ్గా ఇంటికి వచ్చాడు. ఆ రోజు కూతురు ఇంట్లో కనిపించకపోవడంతో భార్య ఆ భర్తను నిలదీసింది. తనకేమీ తెలియదని ఆ భర్త బుకాయించసాగాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ భార్య, గ్రామస్తుల సాయంతో తన పాపను వెతికేందుకు వెళ్లింది. ఎట్టకేలకు తన పాప మృతదేహాన్ని కనుక్కొంది. అక్రమసంబంధం ఉందన్న అనుమానంతోనే, తనకు పుట్టలేదని భార్య చెప్పడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని గ్రామస్తులు ఆరోపించారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, Husband kill wife, Illegal affairs, Wife kill husband

  ఉత్తమ కథలు