Home /News /crime /

FATHER KILLED HER DAUGHTER TO TAKE REVENGE ON HIS WIFE LOVER BUT POLICE SPOILS HIS GAME AK

Tragedy Incident: 11 ఏళ్ల బాలిక హత్య.. ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి.. కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్

పోలీసుల అదుపులో నిందితుడు

పోలీసుల అదుపులో నిందితుడు

బాలిక హత్య గురించి తెలుసుకుని విచారణ మొదలుపెట్టిన పోలీసులు.. ఆ తరువాత రాజేష్ పండిట్‌ను కేసు విచారణ కోసం పిలిపించారు.

    తన భార్య తనకు నమ్మకద్రోహం చేస్తోందని.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని రగిలిపోయాడు ఆమె భర్త. తన భార్యను తనకు కాకుండా చేస్తున్న ఆమె ప్రియుడిని ఎలాగైనా జైలు పాలు చేయాలని ప్లాన్ చేశాడు. అయితే ఇందుకోసం అతడు ఎంచుకున్న ప్లాన్‌కు ఏకంగా అతడి సొంత కూతురు బలైపోయింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని అరారియా జిల్లోలని పలాసిలో రాజేష్ పండిట్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి భార్య, 11 ఏళ్ల కూతురు ఉంది. అయితే అతడి భార్య సూరజ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకుని రాజేష్ రగిలిపోయాడు. తన భార్యను తన నుంచి దూరం చేయాలనుకున్న సూరజ్‌ను ఎలాగైనా జైలుకు పంపాలని ప్లాన్ చేశాడు.

    అయితే ఈ క్రమంలో అతడు తన 11 ఏళ్ల కూతురిని హత్య చేయడం ఈ మొత్తం కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్. తన భార్య, ఆమె ప్రియుడు సూరజ్ ఇద్దరూ కలిసి పారిపోయారు. ఈ క్రమంలో రాజేష్ తన 11 ఏళ్ల కూతురును తాను హత్య చేశాడు. ఆ తరువాత ఆమె దగ్గర తన భార్య, ఆమె ప్రియుడు సూరజ్ కలిసి ఉన్న ఫోటోను పడేశాడు.

    ఈ బాలిక హత్య గురించి తెలుసుకుని విచారణ మొదలుపెట్టిన పోలీసులు.. ఆ తరువాత రాజేష్ పండిట్‌ను కేసు విచారణ కోసం పిలిపించారు. పోలీసు విచారణకు హాజరైన రాజేష్.. తన కూతురిని తన భార్య, ఆమె ప్రియుడు సూరజ్ కలిసి చంపి ఉంటారని పోలీసులకు వివరించాడు. అయితే పోలీసులకు రాజేష్ తీరుపైనే అనుమానం వచ్చింది. దీంతో అతడిని వాళ్లు తమదైన శైలిలో విచారణ చేయడం. ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు.

    Theft: లాయర్ అంటూ పోలీసులనే బురిడీ కొట్టించాడు.. ఈ జాదూగాడు మామూలోడు కాదు..

    Husband: భార్య అదే పనిగా ఫోన్ కాల్స్ మాట్లాడుతుండటంతో ఈ భర్త ఏం చేశాడో చూడండి..

    అలా కొద్దిసేపటి తరువాత తన కూతురును తానే హత్య చేశానని రాజేష్ పండిట్ ఒప్పుకున్నాడు. తన భార్యను తీసుకెళ్లిన సూరజ్‌ను హత్య కేసులో ఇరికించేందుకు ఇలా చేశానని అంగీకరించాడు. అయితే తన భార్య ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు రాజేష్... తన కుమార్తెను హత్య చేయాలని నిర్ణయించుకోవడం చాలామంది ఆశ్చర్యం కలిగించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime, Illegal affair

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు