హోమ్ /వార్తలు /క్రైమ్ /

నీ నాలుగేళ్ల కొడుకు వల్ల నీకు ప్రాణహాని.. అని చెప్పిన జ్యోతిష్కుడు.. దారుణానికి తెగించిన తండ్రి.. అసలేం జరిగిందంటే..

నీ నాలుగేళ్ల కొడుకు వల్ల నీకు ప్రాణహాని.. అని చెప్పిన జ్యోతిష్కుడు.. దారుణానికి తెగించిన తండ్రి.. అసలేం జరిగిందంటే..

మృతిచెందిన బాలుడు

మృతిచెందిన బాలుడు

మీ కొడుకు వల్ల నీకు ప్రాణహాని ఉందంటూ జాతకాలు చెప్పే వ్యక్తి చెప్పడంతో ఆ తండ్రిలో భయం పట్టుకుంది. పిల్లాడిని బంధువుల ఇంట్లో పెంచుదామని భార్యను కోరాడు. దానికి ఆమె ససేమిరా అంది. చివరకు..

మొన్న మొన్ననే కదా, చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢనమ్మకాల వల్ల ఇద్దరు కూతుళ్లను ఆ తల్లిదండ్రులు పొట్టనపెట్టుకున్నారు. దగ్గరుండి మరీ చంపేసి తిరిగిస్తారని ఎదురుచూశారు. ఆ ఘటన మరువకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జాతకాల పిచ్చితో, అవంటే మితిమీరిన నమ్మకంతో కన్న కొడుకునే చంపేశాడో వ్యక్తి. మీ కొడుకు వల్ల నీకు ప్రాణహాని ఉందంటూ జాతకాలు చెప్పే వ్యక్తి చెప్పడంతో ఆ తండ్రిలో భయం పట్టుకుంది. పిల్లాడిని బంధువుల ఇంట్లో పెంచుదామని భార్యను కోరాడు. దానికి ఆమె ససేమిరా అంది. చివరకు ఆ తండ్రి నాలుగేళ్ల వయసున్న కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సజీవ దహనం చేశాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ లో ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ జిల్లాలోని నన్నిళం ప్రాంతంలో రాంకీ అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. అతడికి భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడికి జాతకాల పిచ్చి ఎక్కువ. వాటిని విపరీతంగా నమ్మేవాడు. ఇటీవల కుటుంబంలో సమస్యలు ఉన్నాయంటూ ఓ జ్యోతిష్కుడి వద్దకు వెళ్లాడు. ’నీ కొడుకు వల్ల నీకు ప్రాణహాని ఉంది. అతడు నష్టజాతకుడు. అతడి వల్ల నీకు మరిన్ని ఇబ్బందులు రాక మానవు. ఓ 15 ఏళ్ల పాటు అతడిని దూరంగా ఉంచండి. మీకన్నీ శుభాలే జరుగుతాయి‘ అని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అది నిజమేనని నమ్మిన రాంకీ భార్యతో అవే మాటలను చెప్పాడు. కొన్నాళ్ల పాటు కొడుకు బంధువుల ఇంట్లో ఉంచి పెంచుదామన్నాడు.

దానికి భార్య ఒప్పుకోలేదు. ఈ విషయమై పిబ్రవరి 25న భార్యాభర్తల మధ్య పెద్ద గొడవే జరిగింది. మద్యం మత్తులోనే భార్యతో రాంకీ గొడవపడ్డాడు. ఆ తర్వాత విచక్షణ రహితంగా తన నాలుగేళ్ల కొడుకుపై కిరోసిన పోసి నిప్పంటించాడు. దాదాపు 90శాతానికి పైగా గాయాలతో ఆ పిల్లాడిని స్థానికుల సాయంతో ఆ తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూనే ఆ బాలుడు మృతిచెందాడు. చిన్నారి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. జ్యోతిష్కుడు చెప్పింది నమ్మే తాను ఈ దారుణానికి ఒడిగట్టానని అతడు ఒప్పుకోవడం గమనార్హం.

First published:

Tags: Chennai, Crime news, Crime story, Hyderabad, Tamil nadu

ఉత్తమ కథలు