Crime news : కన్న కూతురునే దారుణంగా చంపి.. ప్రత్యర్థులపై కేసు పెట్టాడు.. !

Crime news : కన్న కూతురునే దారుణంగా చంపి.. ప్రత్యర్థులపై కేసు పెట్టాడు.. !

Crime news : రాజకీయాల కోసం ఓ దుర్మార్గుడు తన కన్న కూతురునే చంపాడు.. అది కూడా తన ప్రత్యర్థులు చంపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై అనుమానంతో దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం బయటపడింది.

  • Share this:
    కూతురినే చంపేసి అది తన ప్రత్యర్థుల పని అని కేసు పెట్టాడు ఓ దుర్మార్గుడు... తండ్రి ఫిర్యాదు మేరకే పోలీసులు (police)కేసు నమోదు చేశారు. కానీ, దర్యాప్తులో తండ్రే అసలు నిందితుడని (accused)తేలింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని (UP) ఝాన్సి జిల్లాలో చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బబ్లూ ప్రజాపతి అనే వ్యక్తి....తన 13ఏళ్ల కూతురు మాయను ఓ నది సమీపానికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి చంపాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    తన ప్రత్యర్థులే (Rivals) చేతిలోని గొడ్డలి(axe) తీసుకుని స్వయంగా చంపడానికి వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారి నుంచి తాను బయటపడ్డానని .. కాని తన కూతురు మాత్రం దాడిలో మరణించిందని అన్నాడు. అయితే స్వయంగా తండ్రి చేసిన ఫిర్యాదును నమ్మి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    ఇది చదవండి :టీచర్ కొట్టడడంతో విద్యార్థినికి పక్షవాతం.. హోంవర్కు చేయనందుకేనంటూ తల్లి ఫిర్యాదు.. !


    కానీ, కేసు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత కనిపించిన సాక్ష్యాలు.. బబ్లూ చెప్పిన మాటలకు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులకు అనుమానాలు వచ్చాయి. దీంతో తండ్రిపై అనుమానాలతో ఆయన్నే విచారణ చేశాు.. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

    తండ్రి బబ్లూ కొంతకాలం ఓ వివాహితతో (extra marital affair) అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అయితే ఆమె ఇటీవలే ఆ సంబంధం తెగిపోయింది. దీంతో పాటు.. బబ్లూ ఇటీవలే తన సోదరుడికి అప్పు ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. దీంతో ఇద్దరిపై బబ్లూ కోపం పెంచుకున్నాడు. వీరిద్దరు సహా మరో ఏడుగురిపై బబ్లూ కేసు పెట్టాడు. ఆ తొమ్మిది మంది కలిసి తన కూతురిని చంపారని ఫిర్యాదు చేశాడు.

    ఇది చదవండి : పెళ్లైన నెలకే భార్యపై అనుమానం..కట్ చేస్తే... భార్యభర్తలు విగతజీవులయ్యారు... !


    కానీ, పోలీసులకు అనుమానాలు రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. తమ స్టైల్లో ప్రశ్నించడంతో సొంత కూతురునే చంపానని ఒప్పుకున్నాడు. అయితే ప్రత్యర్థులను ఇరికించడం కోసం తన కూతురు దారుణంగా చంపడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీసులు బబ్లును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

    ఇది చదవండి : కూతురిపై తండ్రి లైంగిక దాడి.. ప్రతిఘటించిన కూతురు.. పెద్ద సహసమే చేసింది...!

    Published by:yveerash yveerash
    First published: